Begin typing your search above and press return to search.

వరద బాధితులకు అండగా కృష్ణ..!

By:  Tupaki Desk   |   15 Nov 2022 10:37 AM GMT
వరద బాధితులకు అండగా కృష్ణ..!
X
సూపర్ స్టార్ కృష్ణ ఎంత గొప్ప నటుడో.. అంతే దయా హృదయలం కలిగిన వారు. తన సినిమా ఫెయిల్యూర్ అయితే నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా చూసుకునే వారు అందుకే కృష్ణని నిర్మాతల మనిషి అని చెబుతుంటారు.

అంతేకాదు నిర్మాణ విలువ తగ్గించుకునేనుకు నిర్మాతలకు తన పూర్తి సహకారం అందించడంలో కృష్ణ గారు ముందుందుండే వారట. సినిమా త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో తన హాలీడేస్ గ్యాప్ లో కూడా షూటింగ్స్ పెట్టుకునే వారని ఆయనతో పనిచేసిన నిర్మాతలు పలు ఇంటర్వ్యూస్ లో చెప్పారు.

పరిశ్రమకే కాదు ప్రజలకు కూడా కృష్ణ సేవ చేశారు. 1977 నవంబర్ 19న దివిసీమ వరదలు వచ్చాయి. ఆ టైం లో బాధితులకు కృష్ణ అండగా ఉన్నారు. వరద బాధితులకు 10 వేలు విరాళంగా ప్రకటించారు.

బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కోసం లక్ష వరకు ఖర్చు చేశారట. అంతేకాదు ఏడాది పాటు తుఫాన్ బాధితులను ఆదుకునేలా తన ఆదాయంలో 10 శాతం కేటాయించారట. స్వయంగా బాధితులను కలుసుకుని వారికి మనో ధైర్యాన్ని నింపారట. ఇలా ప్రజల కోసం కృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.

సామాజిక కార్యక్రమాలు నిర్వహించే వారికి తన వంతుగా సాయం చేయడంలో ఎప్పుడు ముందుండే వారు కృష్ణ. అంతటి మహా గొప్ప మనసు ఉన్న వ్యక్తి కాబట్టే ఇన్ని కోట్ల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన చేసిన సినిమాలే కాదు ఇలాంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా ఆయన్ని ప్రజల మనిషి అనేలా చేశాయి.

రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరారు కృష్ణ. ఎన్.టి.ఆర్ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ సినిమాలను కూడా చేశారు. 1989లో ఏలూరు ఎంపీగా పోటీ చేసి గెలిచిన కృష్ణ.. 1991లో పోటీ చేసి ఓడిపోయారు. 1991 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు కృష్ణ.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.