Begin typing your search above and press return to search.

18 పేజీలు నిండి పోయాయి.. ఇక వదలడమే

By:  Tupaki Desk   |   12 Aug 2021 10:31 AM GMT
18 పేజీలు నిండి పోయాయి.. ఇక వదలడమే
X
యంగ్‌ హీరో నిఖిల్‌.. అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుకుమార్‌ రైటింగ్స్ మరియు జీఏ2 బ్యానర్‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 18 పేజెస్‌. ఈ సినిమా నుండి ఇప్పటికే హీరో హీరోయిన్ కాన్సెప్ట్‌ పోస్టర్ వచ్చింది. ఫీల్‌ గుడ్‌ లవ్‌ కమ్‌ రొమాంటిక్ మూవీగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. సూర్య ప్రతాప్ ఒక మంచి స్క్రిప్ట్‌ తో సుకుమార్‌ ను మెప్పించి ఈ సినిమాను పట్టాలెక్కించాడు. సుకుమార్‌ భాగస్వామ్యం కూడా ఉండటం వల్ల సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కించామని మేకర్స్‌ చెబుతున్నారు. కరోనా కారణంగా సినిమా చాలా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ముగించినట్లుగా తెలుస్తోంది. హీరో నిఖిల్‌ 18 పేజెస్ సినిమాకు డబ్బింగ్ చెప్పాడు. షూటింగ్‌ ముగించి డబ్బింగ్ చెప్పినట్లుగా నిఖిల్‌ సోషల్‌ మీడియా ద్వారా ఈ ఫొటోను షేర్‌ చేశాడు. 18 పేజెస్‌ సినిమా పై ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు యూత్‌ ఆడియన్స్ లో మంచి క్రేజ్‌ ఉంది. ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో అతి త్వరలోనే విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

నిఖిల్‌ 18 పేజెస్‌ సినిమా చిత్రీకరణ ముగించాడు.. మరో వైపు కార్తికేయ 2 సినిమా చిత్రీకరణ లో కూడా బిజీ అయ్యాడు. కార్తికేయ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్‌ ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు. కార్తికేయ 2 కూడా షూటింగ్‌ చకచక జరుగుతోంది. అతి త్వరలోనే సినిమా షూటింగ్‌ ను ముగించబోతున్నారు. ఈ రెండు సినిమాల్లో ఒక సినిమాను ఈ ఏడాది మరో సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా నిఖిల్‌ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.