Begin typing your search above and press return to search.

ఆకట్టుకుంటోన్న నిఖిల్ - అనుపమల '18 పేజెస్' గ్లింప్స్..!

By:  Tupaki Desk   |   6 April 2022 2:22 PM GMT
ఆకట్టుకుంటోన్న నిఖిల్ - అనుపమల 18 పేజెస్ గ్లింప్స్..!
X
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్‌ సిద్దార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''18 పేజెస్''. పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ - స్క్రీన్‌ ప్లే అందించడం విశేషం. ఇందులో నిఖిల్ సరసన మలయాళ బ్యూటీ అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా నటిస్తోంది.

'18 పేజెస్' అనే డిఫరెంట్ టైటిల్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగించిన మేకర్స్.. ఇప్పటి వరకు వదిలిన ఫస్ట్ లుక్ & స్పెషల్ పోస్టర్స్ తో అంచనాలు పెంచేశారు. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో గ్లింప్స్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

'నాకు తెలియని ఒక అమ్మాయి ఎప్పుడూ ఒక విషయం చెబుతూ ఉండేది.. ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు.. ఎందుకు ప్రేమించామంటే ఆన్సర్ ఉండకూడదు' అని నిఖిల్ చెప్పడంతో ఈ వీడియో ప్రారంభమైంది. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ చాలా అందంగా కనిపించారు.

ఇందులో హుషారైన నేటితరం యువకుడు సిద్ధు పాత్రలో నిఖిల్ నటించగా.. కవితలు రాసే యువతి నందినిగా అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తోంది. అయితే ఆమె రాసిన కథలను సిద్ధు చదవడం మొదలుపెట్టినట్లు వీడియోని బట్టి తెలుస్తుంది. వీరిద్దరూ ఒకరినొకరు కలుసుకోకుండానే రచనల ద్వారా ప్రేమించుకుంటారేమో అనే సందేహం కలుగుతోంది.

సిద్ధు - నందినిల 19 పేజీల ప్రేమ కథ ఏంటో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. మొత్తం మీద ఈ గ్లిమ్స్ చూస్తుంటే సుకుమార్ రాసిన ఒక వైవిధ్యమైన ప్రేమ కథతో '18 పేజెస్' సినిమా రూపొందుతోందని అర్థం అవుతోంది. సినిమాటోగ్రాఫర్ వసంత్ కుమార్ అందించిన విజువల్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి.

దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ జత చేసిన 'నన్నయ్య రాసిన కావ్యం ఆగితే.. తిక్కన తీర్చేనుగా.. రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా..' అంటూ సాగిన నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

'18 పేజెస్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ సీజన్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.