Begin typing your search above and press return to search.

విశ్వరూపం చూపిస్తే 17 కోతలేశారు

By:  Tupaki Desk   |   5 May 2018 2:06 PM GMT
విశ్వరూపం చూపిస్తే 17 కోతలేశారు
X
కమల్ హాసన్ నటించిన విశ్వరూపం2 ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయిపోయింది. అసలు నిర్మాత ఎంతకీ తెమల్చకపోవడంతో.. తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై స్వయంగా రిలీజ్ చేసుకుంటున్నారు కమల్ హాసన్. ఈ సమ్మర్ చివరలో విడుదల చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతుండగా.. ఇప్పటికే తెలుగు తమిళ్ వెర్షన్స్ కు యు సర్టిఫికేట్ కూడా వచ్చేయడం గమనించాలి.

కమల్ హాసన్ అంటే విశ్వనటుడు. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న మహా నటుడు ఆయన. ఇప్పుడు విశ్వరూపం2 చిత్రం హిందీ వెర్షన్ ను సెన్సార్ కోసం పంపారు. వారు కూడా యు సర్టిఫికేట్ ఇచ్చేందుకు ఓకే చెప్పారు కానీ.. విచిత్రంగా ఈ సినిమాలో డైలాగ్స్ పరంగా 17 కట్స్ విధించడం చర్చనీయాంశం అయింది. దీనికి కారణం.. ఈ సినిమాలోని కొన్ని పాత్రలు నిజ జీవితంలో కొందరు రాజకీయ నాయకులను పోలినట్లుగా ఉన్నాయట. అందుకే ఇలా కట్స్ విధించాల్సి వచ్చిందట.

రెండు లాంగ్వేజెస్ లో క్లీన్ సర్టిఫికెట్ అందుకున్న సినిమాకు.. హిందీలో కట్స్ చెప్పడం నిజంగా అభ్యంతరకరమే. గత కొంతకాలంగా హిందీ సెన్సార్ బోర్డు ఇలాంటి వివాదాల్లో ఇరుక్కుంటూనే ఉన్నా.. ఏమాత్రం తన తీరు మార్చుకోకపోవడం చర్చనీయాంశం అవుతోంది. విశ్వరూపం2 కు కట్స్ విధించడంపై.. కమల్ హాసన్ అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని.. అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్లేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది.