Begin typing your search above and press return to search.

16 వ‌యసుకే సంగీత ద‌ర్శ‌కుడు.. మ‌రో రాక్ స్టార్..?

By:  Tupaki Desk   |   8 Sept 2021 12:07 PM IST
16 వ‌యసుకే సంగీత ద‌ర్శ‌కుడు.. మ‌రో రాక్ స్టార్..?
X
స్టార్ ప్రొడ్యూస‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ ఎమ్.ఎస్ రాజు మ‌ళ్లీ ద‌ర్శ‌కుడిగా బిజీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. `వాన` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన రాజు గారు అటుపై `తూనిగ తూనిగ‌` తో మ‌రో ప్ర‌య‌త్నం చేసినా పెద్ద‌గా స‌క్సెస్ అవ్వ‌లేదు. ఇటీవ‌లే బోల్డ్ కంటెంట్ తో `డ‌ర్టీ హ‌రి` చిత్రాన్ని తెర‌కెక్కించి స‌క్సెస్ తో కంబ్యాక్ అయ్యారు. అదే స్పీడ్ ని కొన‌సాగిస్తూ `7 డేస్.. 6 నైట్స్` అనే మ‌రో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కొవిడ్ సెకెండ్ వేవ్ లో సైతం నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ జాగ్ర‌త్త‌గా షూటింగ్ పూర్తి చేసారు.

వంద మంది క్రూ.. నాలుగు కెమెరాలతో గోవా..మంగుళూరు ఉడిపిలో షూటింగ్ చుట్టేసారు. కొన్ని రోజుల్లోనే సినిమా షూటింగ్ ని పూర్తి చేసారు.

డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రీ రికార్డింగ్ ప‌నుల్లో ఉంది. ఇదే సినిమాతో 16 ఏళ్ల‌ కుర్రాడిని సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నారు రాజుగారు. స‌మ‌ర్ధ్ గొల్ల‌పూడి అనే కొత్త కుర్రాడు సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

ఆర్.ఆర్ కి సంబంధించిన చిన్న వీడియో విడుద‌ల‌తో స‌మ‌ర్ధ్ ని ప‌రిచ‌యం చేసారు. గ‌తంలో `దేవి` సినిమాతో దేవి శ్రీ ప్ర‌సాద్ ని సంగీత ద‌ర్శ‌కుడిగా రాజుగారే ప‌రిచ‌యం చేసారు. అప్పుడు దేవి కూడా టీనేజ‌రే. ఆ త‌ర్వాత దేవి త‌న ట్యాలెంట్ తో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఎదిగిన వైనం తెలిసిందే. రాజుగారి హ‌స్తం మంచిది కావ‌డంతోనూ దేవిశ్రీ‌ కొద్ది కాలంలోనే పెద్ద సంగీత ద‌ర్శ‌కుడిగా ఎదిగారు.

తాజాగా స‌మ‌ర్ధ్ కూడా రాక్ స్టార్ రేంజ్ ని అందుకోవాల‌ని ఆకాంక్షిద్దాం. కుర్రాడే అయినా సంగీతంలో పిడుగే. శాస్త్రీయ సంగీతం.. పాశ్చాత్య సంగీతంలో స‌మ‌ర్ధ్ ఆరితేరిపోయాడు. కీబోర్డ్.. గిటారు వాయించ‌డంలో దిట్ట‌. ఇత‌ని పేరుమీద యూట్యూబ్ లో ఓ ప్ర‌త్యేక ఛాన‌ల్ కూడా ఉంది. ఆ ర‌కంగా సోష‌ల్ మీడియా జ‌నాల‌ను బాగా ఆక‌ట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలోనే స‌మ‌ర్ధ్ లో ప్ర‌తిభ‌ను గుర్తించి రాజు గారు అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా లైన్ లో ఉండాగానే స‌మ‌ర్ధ్ మ‌రో మూడు చిత్రాల‌కు కూడా క‌మిట్ అయిన‌ట్లు స‌మాచారం.