Begin typing your search above and press return to search.
కరోనా నష్టం.. నెట్ ఫ్లిక్స్ అదృష్టం..
By: Tupaki Desk | 22 April 2020 4:00 PM ISTకరోనా మహమ్మారి కారణంగా దేశంలో జనాలు ఇళ్లలో నుండి బయటికి రాలేకపోతున్నారు. వారి సామాన్య జీవితాన్ని ఇంతకు ముందులా ఎంజాయ్ చేయలేక పోతున్నారు. మరి ఇళ్లలో ఉండి ఏం చేస్తారు అంటే మాత్రం టీవీలకు, సెల్ ఫోన్లకు అంకితం అవుతారు. ఈ సందర్భంలో దేశ జనాభా ఎక్కువ శాతం ఇంటర్నెట్ వాడే అవకాశం ఉంది. కొత్త కొత్త యాప్స్ డౌన్లోడ్ చేసుకొని సబ్ స్క్రయిబ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ - అమెజాన్ ప్రైమ్ - హాట్ స్టార్ - ఆహా - సన్ ఎక్స్ టి - వుట్ - ఉల్లు లాంటి 'ఓవర్ ది మీడియా'(ఓటిటి) లన్ని నాన్ స్టాప్ స్ట్రీమ్ చేస్తుంటారు. ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లన్నీ ప్రస్తుతం లాభాలను గడిస్తున్నాయి. ఈ సంవత్సరం జనవరి నుండి మార్చి నెల వరకు రికార్డు స్థాయిలో సబ్ స్క్రైబర్లను పొంది టాప్ లో నిలిచింది ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్.
జనవరి నుండి మార్చి మధ్య కాలం వరకు రికార్డు సృష్టిస్తూ 15.8 మిలియన్ల కొత్త సబ్ స్క్రైబర్లను పొందిందట. నెట్ ఫ్లిక్స్ ని ప్రపంచంలోని 183 దేశాల ప్రజలు ఉపయోగిస్తున్నారు. నిజానికి ఈ మూడు నెలల అంచనా కేవలం 6-7మిలియన్లు మాత్రమే. కానీ ఈ ఓటిటి ఊహించిన విధంగా డానికి డబల్ అంటే 16 మిలియన్స్ పెరగడం ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. అయితే నెట్ ఫ్లిక్స్ వారు డిమాండ్స్ ని - మరియు వ్యూస్ బట్టి సభ్యత్వ నమోదు పెంచేసింది. 2020 మొదటి మూడు నెలల టైంలోనే యూఎస్ ఏ - కెనడాలలో 2.3 మిలియన్స్ జనాలు కొత్తగా చందా కట్టి ఎంజాయ్ చేస్తున్నారట. అయితే కరోనా ముగిసిన తర్వాత యూఎస్ లో సబ్ స్క్రయిబర్స్ పెరిగే అవకాశం ఉందట.