Begin typing your search above and press return to search.

1500 థియేట‌ర్లు ఫంక్ష‌న్ హాళ్లు గోదాములుగా..

By:  Tupaki Desk   |   24 Dec 2020 3:00 PM IST
1500 థియేట‌ర్లు ఫంక్ష‌న్ హాళ్లు గోదాములుగా..
X
ఎగ్జిబిష‌న్ రంగం ఎప్పుడూ క‌ష్టాలు న‌ష్టాల్లోనే ఉంద‌ని ఎగ్జిబిట‌ర్లంతా గ‌గ్గోలు పెడుతుంటారు. సినిమా ఆడ‌క‌పోతే క‌రెంట్ బిల్లులైనా గిట్ట‌ని ప‌రిస్థితి ఉంటుంద‌న్న నివేద‌న వినిపిస్తూనే ఉంటుంది. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగిల్ స్క్రీన్లు ఇప్ప‌టికే తెర‌మ‌రుగ‌య్యాయి. ఇప్పుడు క‌రోనా క‌ష్ట‌కాలంలో మ‌రిన్ని సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు మూత‌ప‌డే ప‌రిస్థితి ఉంద‌న్న స‌మాచారం ఉంది.

తాజాగా ప్ర‌ఖ్యాత మ‌నీ కంట్రోల్ స‌ర్వే ప్ర‌కారం.. దేశంలో 1500 పైగా థియేట‌ర్లు మూత‌ప‌డేందుకు ఆస్కారం ఉంద‌ని వెల్ల‌డైంది. ఇందులో ఎక్కువ‌గా సౌత్ నుంచి సింగిల్ స్క్రీన్లు మూత‌ప‌డ‌తాయ‌ని స‌ద‌రు స‌ర్వే పేర్కొంది. ముఖ్యంగా ద‌క్షిణాదిలో ఎక్కువ‌గా గోదాములు ఫంక్ష‌న్ హాళ్లుగా థియేట‌ర్లు మారుతున్నాయ‌ని రిపోర్ట్ అందింది.

ఏపీ-తెలంగాణ క‌లుపుకుని ఇంత‌కుముందు 2500 వ‌ర‌కూ థియేట‌ర్లు ఉండేవి. కానీ ఇప్పుడు 1600 రేంజుకు త‌గ్గిపోయాయి. మునుముందు ఈ సంఖ్య మ‌రింత‌గా త‌గ్గేందుకు ఆస్కారం ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక ఏపీలో క్రైసిస్ కాలంలోని 3నెల‌ల క‌రెంట్ బిల్లుల మాఫీ కొంత‌వ‌ర‌కూ ఆదుకోనుంది. ఈ క్రిస్మ‌స్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌లో క‌ళ ఉంటుంద‌ని ఆశిస్తున్నారు. సాయి తేజ్ న‌టించిన సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ డిసెంబ‌ర్ 25న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.