Begin typing your search above and press return to search.

స్వీటీకి తప్ప మరే హీరోయిన్ కు ఈ లక్ దక్కదేమో?

By:  Tupaki Desk   |   13 March 2020 4:30 PM GMT
స్వీటీకి తప్ప మరే హీరోయిన్ కు ఈ లక్ దక్కదేమో?
X
సినిమా ఇండస్ట్రీలో హీరోకు ఉండే ప్రాధాన్యం.. హీరోయిన్ కు ఉండదు. సినిమాకు హీరోయిన్ అన్నది ఆభరణమే తప్పించి.. ఆమె అంతా కానే కాదన్న విషయాన్ని ఎవరైనా ఒప్పేసుకుంటారు. మేల్ డామినేషన్ భారీగా ఉన్న పరిశ్రమల్లో సినిమా ఇండస్ట్రీ అందులో మొదట ఉంటుందని చెప్పాలి. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఏ హీరోకు.. మరే హీరోయిన్ కు దక్కని ఒక లక్ అనుష్క అలియాస్ స్వీటీకి దక్కిన వైనాన్ని ప్రత్యేకంగా చెప్పాలి.

ఇండస్ట్రీ అన్న తర్వాత హీరోలు.. హీరోయిన్లు బోలెడంత మంది ఉంటారు. సినిమా హిట్ అయితే ఆకాశంలోకి.. ఫట్ అయితే పాతాళంలోకి కూరుకు పోవటం కామన్. సినిమాలు చేస్తున్నప్పుడు ఉండే క్రేజ్.. మధ్యలో బ్రేక్ వస్తే అంతలా ఉండదు. ఎంత పెద్ద స్టార్ అయినా పెద్దగా పట్టించుకోవటం కనిపించదు.

అలాంటిది ఇటీవల కాలంలో పెద్ద సినిమాలు లేకున్నా అనుష్కకు అద్భుతమైన దక్కిందని చెప్పాలి. తాజాగా ఆమె చేస్తున్న మూవీ నిశ్శబ్దం. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలవుతోంది. ఇదిలా ఉంటే.. అనుష్క ఇండస్ట్రీలోకి ఎంటరై 15 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ.. ‘‘సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క’’ పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రొగ్రాం సినిమా ప్రమోషన్ అని చెప్పండి.. అనుష్కకు దక్కిన గౌరవంగా చెప్పండి.. ఏం చెప్పినా.. ఒక కార్యక్రమానికి దిగ్గజ దర్శకులతో పాటు.. పలువురు సినీ ప్రముఖులు హాజరు కావటం గొప్పగా చెప్పక తప్పదు.

రాజమౌళి.. రాఘవేంద్రరావు.. పూరి జగన్నాథ్.. వైవీఎస్ చౌదరి.. శ్రీవాస్.. హేమంత్ మధుకర్ లతో పాటు.. పలువురు బడా నిర్మాతలు ఈ కార్యక్రమాం లో పాల్గొన్నారు. ఇంత భారీగా ప్రముఖులు హాజరై.. ఒక హీరోయిన్ కెరీర్ పదిహేనేళ్లు పూర్తి చేసుకునే ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేయటం చూసినప్పుడు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనుకోకుండా ఉండలేం. ఈ క్రెడిట్ స్వీటీ సొంతంగా చెప్పక తప్పదు.