Begin typing your search above and press return to search.

15 వసంతాల అల్లు అర్జున్!!

By:  Tupaki Desk   |   29 March 2018 10:14 AM IST
15 వసంతాల అల్లు అర్జున్!!
X
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో అల్లు అర్జున్ చేరిపోయి చాలాకాలమే అయింది. వరుసగా టాప్ గ్రాసింగ్ సినిమాలతో అలరిస్తున్నాడు బన్నీ. అన్ని రకాల ఆడియన్స్ ను థియేటర్లకు రాబట్టగల సత్తా ఉన్న హీరోగా ఎదిగాడు. 15 సంవత్సరాల జర్నీలో ఎన్నో మెట్లు అధిరోహించాడు ఈ మెగా హీరో.

నిన్నటితో అల్లు అర్జున్ టాలీవుడ్ హీరోగా అవతరించి 15 ఏళ్లు పూర్తయింది. బన్నీ హీరోగా రూపొందిన తొలి చిత్రం గంగోత్రి.. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం ఇదే రోజున.. అంటే 2003 మార్చ్ 28న విడుదల అయింది. ఈ సందర్భంగా తనను లాంఛ్ చేసిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు.. అశ్వినీదత్.. తండ్రి అల్లు అరవింద్ లకు కృతజ్ఞతలు తెలిపాడు అల్లు అర్జున్. ఇప్పటివరకూ తన సినీ ప్రయాణంలో తోడుగా.. అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తాను అందరికీ ఎంతో రుణపడి ఉంటానని అన్నాడు బన్నీ.

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన తొలి చిత్రం గంగోత్రి అయినా.. అంతకు ముందే టాలీవుడ్ ప్రేక్షకులకు కనిపించాడు. మెగాస్టార్ మూవీ డాడీలో తన డ్యాన్సింగ్ ట్యాలెంట్ చూపించి మురిపించాడు అల్లు అర్జున్. ఈ కుర్రాడు బాగా డ్యాన్సులు చేస్తున్నాడే అని మెగాస్టార్ తో ఆ సినిమాలో అనిపించుకున్నందుకు కాబోలు.. ఆ తర్వాత డ్యాన్సింగ్ పై విపరీతంగా ఫోకస్ పెట్టి.. ఇండస్ట్రీలో డ్యాన్సుల రేంజ్ ను స్టైల్ ను మరో మెట్టు ఎక్కించి స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు.