Begin typing your search above and press return to search.

#144 కోట్లు.. ప్రియానిక్ 7 బెడ్ రూమ్ ఇల్లు సొగ‌సు చూడ‌త‌ర‌మా?

By:  Tupaki Desk   |   1 April 2021 1:30 PM GMT
#144 కోట్లు.. ప్రియానిక్ 7 బెడ్ రూమ్ ఇల్లు సొగ‌సు చూడ‌త‌ర‌మా?
X
ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జంట లాస్ ఏంజిల్స్ లో రూ .144 కోట్ల విలువైన సొంత భ‌వంతిలో నివాసం ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఇంట్లో విలాసాలు సౌక‌ర్యాల గురించి తెలుసుకునే కొద్దీ తెలుసుకోవాల‌నిపించేంతటి ఆస‌క్తిక‌ర విశేషాలు ఉన్నాయి. విశాల‌మైన‌ భవనం లోపల స‌క‌ల‌సౌక‌ర్యాల స‌మాహారంగా ఈ నిర్మాణం ఒక అద్భుతం అని చెబుతున్నారు ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ లు.. ఆర్కిటెక్ట్ లు.

వివాహం అనంత‌రం ఒక సంవత్సరం తరువాత ప్రియాంక -నిక్ లాస్ ఏంజిల్స్‌లోని ఎన్సినో ప్రాంతంలో ఈ అద్భుతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. దీని ధర 20 మిలియన్ డాలర్లు (రూ. 144 కోట్లు). నా సంతోషం ఉన్న చోటు ఇది. నా చుట్టూ ప్రేమించే వ్యక్తులను కలిగి ఉన్నంత కాలం ఈ ఇల్లే నా లోకం. నాకు ముంబై - న్యూయార్క్ ‌లో ఇళ్లు ఉన్నాయి.. అని పీసీ తెలిపారు. ముంబైలో ఇల్లు నిటారుగా ఉంటే... LA ఇల్లు పూర్తిగా అడ్డంగా ఉంటుంది అంటూ పీసీ ఓ చిట్ చాట్ లో ఛ‌మ‌త్కరించారు. తాజాగా ఆ ఇంటి లోపల నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైర‌ల్ గా మారాయి.

ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్.. అద్భుతమైన పెరడు తో ప్రియానిక్ నివాసంలో ఏడు బెడ్ రూములు పదకొండు బాత్రూములతో ఎంతో సౌక‌ర్య‌మైన‌ది. LA హోమ్ లో లివింగ్ రూమ్ ఖరీదైన క్రీమ్ క‌ల‌ర్ సోఫాలు.. దంతపు అలంక‌ర‌ణ‌లతో త‌ళుకులీనుతుంది.. రాతి గోడల పొయ్యి.. లోతట్టు చెక్క కాఫీ టేబుల్ .. నేల నుండి పైకప్పు కిటికీలు.. ప్ర‌తిదీ ప్ర‌త్యేక‌మే. ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ ఏకాంత‌ గదిలో ప్ర‌త్యేక‌మైన‌ సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. ఇది ఒక జంట హాయిగా ఎంతో స్వేచ్ఛ‌గా ఎక్కువ‌ సమయం గడపడానికి స‌రిపోతుంది.

ఇంటి స్థ‌లం.. తెలుపు- క్రీమ్- టాన్ - బ్రౌన్.. రాతి గోడల షేడ్స్ తో డిజైన్స్ ఎంతో అందంగా ఉంటాయి. ఇంట్లో బాగా అమర్చిన జిమ్ ఉంది. ఒక గోడపై కొన్ని ఫోటో ఫ్రేమ్ లు...పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటును చూడవచ్చు. LA హోమ్ కిచెన్ కూడా క్రీమ్ అండ్ వైట్ కలర్ మిశ్ర‌మ రంగుల‌తో ఉంది.

అంద‌మైన విశాల‌మైన పెర‌డుతో పాటు ఇంటికి ఒక వైపు బీచ్ ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. మ‌రొక వైపుగా పర్వతాల వరుసలు ఇంటి నుంచి క‌నిపిస్తాయి. ఈ స్థలంలో అత్యంత భారీ ఈత‌ కొలను కూడా ఉంది. ఇక్కడ ఈ జంట సుదీర్ఘ స‌మ‌యం ఈత కొడుతూ టైమ్ స్పెండ్ చేయొచ్చు.

పెంపుడు కుక్కలు డయానా- పాండా ది పంక్ -గినోలకు సీటింగ్ అమరిక కూడా ఈ పెర‌డులో ఉంది. ఈ జంట తమ పెంపుడు జంతువులతో విడదీయరాని అనుబంధాన్ని క‌లిగి ఉన్నారు. వాటితో స‌మ‌యం గడపడానికి ఇష్టపడే ప్రదేశం కూడా ఇదే.

వంటగది వంటి విశ్రాంతి గదిలో అన్ని దంతపు ఇంటీరియర్ డిజైన్ ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ఇంట్లో ఓ గ‌దిలో ప్రొజెక్టర్ కూడా ఉంది, అక్కడ ఈ జంట సినిమాలు చూస్తూ రాత్రి వేళ‌లు ఆనందిస్తారు. ఇలా చెప్పుకుంటూ వెళితే 144 కోట్ల ఖ‌రుదు‌కు ఏమాత్రం త‌గ్గ‌ని వ‌స‌తులు ఈ ఇంట్లో ఉన్నాయ‌ని అర్థ‌మ‌వుతుంది.