Begin typing your search above and press return to search.
ఈ ప్రొడక్షన్ లక్ ఎప్పుడు మారుతుందో
By: Tupaki Desk | 3 May 2018 11:30 PM ISTసినిమాలు నిర్మించడమంటే కత్తి మీద సాము లాంటిదే. రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు. కేవలం నమ్మకంతో పెట్టుబడి పెట్టి సినిమాను నిర్మించాలి. మొదట్లో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న చాలా మంది ఒక సినిమా ద్వారా చాలా నష్టపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఏకే ఎంటర్టైన్మెంట్ వారు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ మొదట్లో అందిన సక్సెస్ లో ఇప్పుడు అందడం లేదు.
14 రిల్స్ ద్వారా రామ్ ఆచంట - గోపిచంద్ ఆచంట తో పెద్ద సినిమాలను నిర్మించిన అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా చిన్న హీరోలతో సినిమాలు చేశారు. బిందాస్ సినిమా ద్వారా ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసి మంచి హిట్ అందుకున్నారు. అల్లరి నరేష్ తో అహ నా పెళ్ళంటా ద్వారా కూడా మరో హిట్ అందుకొని ముందుకు వెళ్లారు. కానీ ఆ తరువత ఈ ప్రొడక్షన్ కి బ్యాడ్ లక్ ఎక్కువగా వెంటాడింది. అల్లరి నరేష్ - రాజ్ తరుణ్ వంటి వారు వరుసగా అపజయలను అందుకున్నారు.
ముఖ్యంగా రాజ్ తరుణ్ అందగాడు - కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఎంతవరకు లాభాలను అందించిందో గాని సినిమాలూ మాత్రం పెద్దగా హిట్ అవ్వలేదు. రీసెంట్ గా నిఖిల్ కిరాక్ పార్టీని కూడా ఈ ప్రొడక్షన్ నుంచి వచ్చిందే. సినిమా సౌండ్ మొదటి రోజు తప్పితే మళ్లీ వినిపించలేదు. మరో నాలుగు రోజులకు అసలే కనిపించలేదు. ఇలా ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న సినిమాలు చిన్న హీరోలకు ఏ మాత్రం లాభాన్ని ఇవ్వడం లేదు. మరి ముందు ముందు ఏమైనా విజయాలు అందుతాయో చూడాలి.