Begin typing your search above and press return to search.

చైతూ 'థ్యాంక్యూ' తర్వాత 13బి..!

By:  Tupaki Desk   |   6 Sep 2021 2:58 AM GMT
చైతూ థ్యాంక్యూ తర్వాత 13బి..!
X
కరోనా వల్ల వృదా అయిన టైమ్‌ ను బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో కవర్ చేసేందుకు గాను యంగ్‌ హీరోలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో హీరో మూడు నాలుగు సినిమాలను విడుదలకు సిద్దం చేస్తున్నారు. అక్కినేని హీరో నాగచైతన్య కూడా ఇప్పటికే లవ్‌ స్టోరీ సినిమాతో రెడీగా ఉన్నాడు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న థ్యాంక్యూ సినిమా కూడా అతి త్వరలోనే విడుదల కోసం రెడీ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. చైతూ సినిమాలు మాత్రమే కాకుండా ఓటీటీ ఎంట్రీకి కూడా సిద్దం అవుతున్నాడు అనేది తెలిసిన విషయమే. ఓటీటీ లో ఇప్పటికే సమంత ఎంట్రీ ఇచ్చింది.. వెంకటేష్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.. ఇంకా చాలా మంది స్టార్స్ కూడా ఓటీటీ వైపు చూస్తున్నారు. ఈ సమయంలో ప్రముఖ ఓటీటీ కోసం నాగచైతన్య ఒక థ్రిల్లర్‌ హర్రర్‌ వెబ్‌ సిరీస్ ను చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగచైతన్య ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు త్వరలో విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో వెబ్‌ సిరీస్ ను చేయబోతున్నాడట. అది హర్రర్ కాన్సెప్ట్‌ అంటున్నారు. విక్రమ్‌ కుమార్‌ ఇప్పటికే 13 బి అనే హర్రర్‌ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. తమిళంలో వచ్చిన ఆ సినిమా అన్ని భాషల్లో కూడా ప్రేక్షకులను అలరించింది. అన్ని వర్గాల వారిని ఎంటర్ టైన్ చేసిన ఆ సినిమా తరహాలోనే చైతూ కోసం కూడా ఒక విభిన్నమైన హర్రర్ కథను తనదైన శైలి లో స్క్రీన్‌ ప్లేతో నడిపించడం కోసం థ్యాంక్యూ డైరెక్టర్ విక్రమ్‌ కుమార్‌ స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నాడు అనేది టాక్‌.

థ్యాంకు సినిమాను చేసిన వెంటనే మళ్లీ వీరిద్దరు ఓటీటీ కంటెంట్ కోసం కలవడం ఆసక్తికర విషయం. థ్యాంక్యూ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్యూ వచ్చిన కొన్ని రోజులకే ఓటీటీ లో వీరి హర్రర్‌ వెబ్‌ సిరీస్ స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ వర్క్‌ జరుపుతున్నారు అనేది సమాచారం. నాగచైతన్య మరో వైపు బంగార్రాజు షూటింగ్‌ లో కూడా పాల్గొంటున్నాడు. బంగార్రాజు కోసం చైతూ కేటాయించబోతున్న డేట్లు కొన్నే కనుక ఈ ఏడాదిలోనే చైతూ 13 బి తరహా వెబ్‌ సిరీస్ ను మొదలు పెట్టబోతున్నాడు అనేది అక్కినేని వర్గాల నుండి అందుతున్న టాక్‌. పలు ఇంటర్వ్యూల్లో చైతూ మాట్లాడుతూ తనకు హర్రర్‌ సినిమాలు అంటే కాస్త భయం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. అలాంటి చైతూ ఇప్పుడు ఎలా ఈ వెబ్‌ సిరీస్‌ ను చేస్తాడు అనేది చూడాలి.