Begin typing your search above and press return to search.

1.20 ల‌క్షల‌ ఖ‌రీదు చీర‌...పెళ్లి క‌ళ వ‌చ్చేసిందే బాలా..!

By:  Tupaki Desk   |   7 Dec 2020 5:00 AM IST
1.20 ల‌క్షల‌ ఖ‌రీదు చీర‌...పెళ్లి క‌ళ వ‌చ్చేసిందే బాలా..!
X
ఇది పెళ్లిళ్ల సీజ‌న్. వరుస‌గా సెల‌బ్రిటీ వెడ్డింగ్ ల‌కు అవ‌కాశం క‌ల్పించింది మ‌హ‌మ్మారీ. ఈ లాక్ డౌన్ పీరియ‌డ్ చాలా వాటికి సొల్యూష‌న్ గా మారింది. ఏదైతేనేం.. స్టార్ డాట‌ర్ ఆథియా శెట్టి పెళ్లి గురించి కూడా ఇటీవ‌ల ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగాయి. టీమ్ ఇండియా యంగ్ ప్లేయ‌ర్ రాహుల్ తో ప్రేమాయ‌ణం నేప‌థ్యంలో ఆథియా పెళ్లికి రెడీ అవుతోంద‌న్న ప్ర‌చారం అంత‌ర్జాలంలో వేడెక్కిస్తోంది.

అయితే అంత‌కుముందే ఆథియా పెళ్లికూతురు దుస్తుల్లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ కొత్త లుక్ లో అతియా శెట్టి ఫ్యాషన్ గోల్ ఫిక్స్ చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. హై-ఎండ్ డిజైనర్ తరుణ్ తహిలియాని అల్మారాల నుండి అద్భుతమైన కాన్సెప్ట్ చీర ఇది. ఈ లుక్ లో స్నేహితుడి వివాహానికి హాజరైందిట ఆథియా. ఇక పెళ్లిలో తోడ‌పెళ్లికూతురిలా ఆథియా చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఇక పెళ్లంతా క‌ళ్ల‌న్నీ ఆమె పైనే!

ఇలా క్రిస్ట‌ల్స్ తో కూడిన ఫాబ్రిక్ చీరలో షో స్టాప‌ర్ గా నిలిచిన ఆలియా గురించే చ‌ర్చంతా. ఆ పెర్ల్ వైట్ డ్రాప్డ్ కాన్సెప్ట్ చీరలో బంగారు అంచుతో కూడిన డిజైన్ ఆక‌ర్షిస్తోంది. ఆమె నడుము చుట్టూ నాగ‌రం లుక్ ఆక‌ట్టుకుంటోంది.

ఆ అందమైన చీరకు జ‌త‌గా అసాధారణ భారీ ఎంబ్రాయిడరీ జాకెట్టు త‌ళుకుబెళుకుల‌కు ఫిదా అవ్వ‌ని వాళ్లే లేర‌. పెర్ల్ ఎంబ్రాయిడరీతో జర్డోజీ వ‌ర్క్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఇది స్ట్రెచ్ టిల్లే ఫాబ్రిక్ ‌తో తయారు చేశారు. టోపీ స్లీవ్స్ ‌తో ఈకల అమ‌రిక‌తో అలంకరించ‌డం కొస‌మెరుపు.

అతియా ధ‌రించిన సూక్ష్మ ఆభ‌ర‌ణాలు మ‌రో హైలైట్. ఆమె ఉంగరం బంగారు గాజులతో జత చేసిన జాడౌ డ్రాప్ చెవిరింగులు సంథింగ్ స్పెష‌ల్ ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

28 ఏళ్ల ఆథియా ఈ లుక్ కోసం మేకప్ ‌ను తక్కువగా వినియోగించింది. ఆమె డ్యూ నేచురల్ గ్లామ్ ‌లో పింక్ బ్లష్ -మ్యాచింగ్ లిప్ ‌స్టిక్ ‌తో జత చేసిన ఆన్-పాయింట్ ఐలైనర్ .. మాస్కరాతో క‌నిపించింది. ఇంత‌కీ ఈ డ్రెస్ ఆభ‌ర‌ణాల ఖ‌రీదు ఎంత‌? అంటే.. ఓవ‌రాల్ గా.. చీర‌కు 1.2ల‌క్ష‌లు.. ఇత‌ర ఆభ‌ర‌ణాల డిజైన్ క‌లుపుకుని119900 రూపాయలు అయ్యింద‌ట‌.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అథియా శెట్టి 2015 లో విడుదలైన హీరో చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో సూరజ్ పంచోలి ప్రధాన పాత్రలో నటించారు. ఆమె చివరిసారిగా మోటిచూర్ చక్నాచూర్ లో కనిపించింది. 2019 లో విడుదలైన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా కథానాయకుడిగా నటించారు.