Begin typing your search above and press return to search.

పండుగాడికి పన్నెండేళ్లు

By:  Tupaki Desk   |   28 April 2018 1:55 PM GMT
పండుగాడికి పన్నెండేళ్లు
X
నిన్నగాక మొన్న చూసినట్టుంది.. టీవీలో ఇవ్వాళ వచ్చినా మళ్లీ చూడాలనే అనిపిస్తుంది. అదే మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ పోకిరీ. పండుగాడు గా మాస్ రోల్ లో మహేష్ వెండితెరపై వీర విజృంభణ చేశాడు. ఇందులో మహేష్ మ్యానరిజం నుంచి డైలాగ్స్ వరకు జనాలకు బాగా కనెక్టయ్యాయి. ఎంతగా అంటే ‘‘ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో’’ డైలాగ్ ఇప్పటికీ సినిమాల్లో.. టీవీ ప్రోగ్రాంల్లో స్పూఫ్ గా వినిపిస్తూనే ఉంటుంది.

ఈ మూవీ వచ్చి ఇప్పటికి పన్నెండేళ్లు అవుతుంది. పుష్కర కాలంపాటు జనాలు ఒక సినిమాను గుర్తుంచుకోవడం అంటే సామాన్యమైన విషయమేం కాదు. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ లో అతిపెద్ద హిట్ పోకిరియే. ఈ మూవీలో మమేష్ - ఇలియానాల జోడీ అదుర్స్ అనే చెప్పాలి. ఈ సినిమా తరవాతే ఇలియానా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ పన్నెండేళ్లలో మహేష్ గ్లామర్ అచ్చం అలాగే ఉండటం ఇంకో విశేషం.

ఈ టీంలో మహేష్ - పూరి జగన్నాథ్ టాలీవుడ్ ప్రేక్షకులను ఇప్పటికీ ఎంటర్ టెయిన్ చేస్తుండగా హీరోయిన్ ఇలియానా మాత్రం ఇక్కడ నుంచి ముంబయికి మార్చేసింది. బాలీవుడ్ లో అప్పుడప్పుడు సినిమా చేస్తూ కెరీర్ నెట్టుకొస్తోంది. ఎప్పుడైనా పండుగాడు టీవీలో కనిపిస్తే ఒక ఐదు నిమిషాలు చూడండి.. ఛానల్ మార్చబుద్ధేయదు. సినిమా మొత్తం చూసేయగలం. అదీ పండుగాడంటే.