Begin typing your search above and press return to search.

కబాలి.. ఒక థియేటర్లో 119 షోలా?

By:  Tupaki Desk   |   21 July 2016 5:29 AM GMT
కబాలి.. ఒక థియేటర్లో 119 షోలా?
X
ఎంత మల్టీప్లెక్సైనా కావచ్చు.. అందులో ఎక్కువ స్క్రీన్లే ఉండొచ్చు.. మరీ ఒకే రోజు ఒక సినిమాను 119 షోలు ప్రదర్శించడం ఎక్కడైనా విన్నామా.. కన్నామా? ‘కబాలి’ సినిమా విషయంలో ఈ చిత్రం చోటు చేసుకోబోతోంది. చెన్నైలోని మాయాజల్ మల్టీప్లెక్సులో శుక్రవారం ఏకంగా 119 షోలు ‘కబాలి’ని ప్రదర్శించబోతున్నారు. చెన్నైలోని మరో ప్రముఖ మల్టీప్లెక్స్ సత్యం కూడా 99 షోలతో రికార్డు స్థాయిలో ‘కబాలి’ స్క్రీనింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటిదాకా సత్యం మల్టీప్లెక్సులో గరిష్టంగా ఒక రోజు ఒక సినిమాకు 50 షోలు మాత్రమే వేశారట. ఇప్పుడు ‘కబాలి’ సినిమాకు దానికి రెట్టింపు స్థాయిలో షోలు వేయబోతున్నారు.

ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈ మల్టీప్లెక్సుల్లో ఉన్న అన్ని స్క్రీన్లలోనూ ‘కబాలి’నే ప్రదర్శించబోతున్నారు. చెన్నై నగరంలో దాదాపు 90 శాతం స్క్రీన్లలో ‘కబాలి’ సందడి చేయబోతోంది. తమిళనాడు అంతటా శుక్రవారం ‘కబాలి’ సందడే కనిపించబోతోంది. కబాలి ద్వారా మ్యాగ్జిమం లాభం పొందేందుకు డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు చేయాల్సిందంతా చేస్తున్నారు. వేరే సినిమాల్ని కూడా తీసేసి ఫస్ట్ వీకెండ్ అంతా ‘కబాలి’నే ఆడించబోతున్నారు. అన్ని చోట్లా టికెట్ల రేట్లు పెరిగిపోయాయి. థియేటర్ల దగ్గర టికెట్లు కొని బ్లాకులో వేలకు వేలు పెట్టి అమ్ముకుంటున్న వాళ్లకు లెక్కే లేదు. చెన్నైలోని కాశి థియేటర్లలో ఉదయం నాలుగు గంటలకు ఓ షో వేయబోతున్నారు. దాని టికెట్ రేటు రూ.2400 పెట్టి అఫీషియల్‌గానే అమ్ముతుండటం విశేషం.