Begin typing your search above and press return to search.
నమ్మలేక పోతున్నానంటున్న చరణ్..!
By: Tupaki Desk | 28 Sept 2018 11:43 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 11 ఏళ్లు పూర్తి అయ్యింది. చరణ్ మొదటి చిత్రం ‘చిరుత’ విడుదలై 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. రామ్ చరణ్ 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా హ్యాష్ ట్యాగ్ తో తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక తన 11 ఏళ్ల జర్నీపై ఫేస్ బుక్ లో రామ్ చరణ్ కాస్త ఎమోషనల్‌గా స్పందించాడు.
చరణ్ ఫేస్ బుక్ లో.. 11 ఏళ్లు పూర్తి అయ్యాయంటే నమ్మలేక పోతున్నా, నిన్ననే నటించడం ప్రారంభించినట్లుగా అనిపిస్తుంది. తనపై అభిమానం చూపిస్తూ నన్ను ఇంత దూరం నడిపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. నాతో సినిమాలు చేసిన దర్శక నిర్మాతలకు మరియు నటీనటులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నాడు. చిరుత చిత్రంతో మొదలు పెట్టి వరుస క్రమంలో తాను చేసిన సినిమాల పోస్టర్స్ అన్ని కూడా ఒకే పోస్టర్ లో పోస్ట్ చేశాడు.
ఈ 11 ఏళ్లలో రామ్ చరణ్ 11 సినిమాలను చేశాడు. ప్రస్తుతం 12వ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఒక వైపు హీరోగా కొనసాగుతూనే మరో వైపు నిర్మాతగా కూడా రామ్ చరణ్ ఒక చిత్రాన్ని నిర్మించి, ప్రస్తుతం మరో చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. రామ్ చరణ్ త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని చేయబోతున్నాడు. మరో మూడు సంవత్సరాల వరకు చరణ్ డైరీ ఫుల్ బిజీగానే ఉంది.