Begin typing your search above and press return to search.

11:11 కోటి త‌న‌యుడి థ్రిల్ల‌ర్ ప్ర‌యోగం

By:  Tupaki Desk   |   26 Jan 2022 1:24 PM GMT
11:11 కోటి త‌న‌యుడి థ్రిల్ల‌ర్ ప్ర‌యోగం
X
వెట‌ర‌న్ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి న‌టించిన తాజా చిత్రం 11:11. కిట్టు నల్లూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. కోటి కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో వర్షా విశ్వనాథ్ క‌థానాయిక‌. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. ఈ మోషన్ పోస్టర్ కోసం మేకర్స్ ఒక కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక థీమ్ ను వెల్ల‌డిస్తోంది. ప్రేయ‌సి ప్రియుల మ‌ధ్య‌కు కొత్త వ్య‌క్తి ప్ర‌వేశిస్తాడు. అత‌డు ప్రియురాలి చెయ్యి ప‌ట్టుకోగానే ప్రియుడు కోపంతో అత‌డి బుర్ర ప‌గ‌ల‌గొడతాడు! ఆ త‌ర్వాత ఏమైంది? అన్న‌దే థీమ్. థీమ్ కి త‌గ్గ‌ట్టే థ్రిల్లింగ్ ఎమోష‌న్స్ తో క‌ట్టి ప‌డేసే ల‌వ్ క్రైమ్ డ్రామా ఇది అని అర్థ‌మ‌వుతోంది. మోషన్ పోస్టర్‌కి మణిశర్మ అదిరిపోయే బిజిఎమ్ అందించారు.

ఈ చిత్రానికి ఈశ్వర్ సినిమాటోగ్రాఫర్. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాల పై ప్రొడక్షన్ నెంబర్ 1గా కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు గాజుల వీరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని వెల్ల‌డిస్తారు. ఆకాశ‌మే హ‌ద్దు- ఓరి దేవుడోయ్- టైటానిక్-చిన్ని చిన్ని ఆశ లాంటి చిత్రాల‌లో రాజీవ్ సాలూరి న‌టించారు. రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒక నిమిషం రెండు సెకనుల నిడివితో కట్ చేసిన ఈ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్ ఆద్యంతం ఆస‌క్తిని పెంచింది. గతంలో ఈ 11:11 చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్‌ ను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో చిరు చేతుల‌మీదుగా లాంచ్ చేసిన సంతి తెలిసిందే.

రోహిత్- కోటి సాలూర్- సదన్- లావణ్య- రాజా రవీంద్ర- రాజా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ రవి మాన్ల- డైలాగ్స్ పవన్ కె అచల- మ్యూజిక్ మణిశర్మ., స్టోరీ- స్క్రీన్ ప్లే- డైరెక్షన్ కిట్టు నల్లూరి.