Begin typing your search above and press return to search.

మూడేళ్లకు 100మిలియన్స్ క్లబ్బులో చేరిన డీజే..!

By:  Tupaki Desk   |   23 April 2021 11:30 PM GMT
మూడేళ్లకు 100మిలియన్స్ క్లబ్బులో చేరిన డీజే..!
X
ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు టీజర్స్, ట్రైలర్స్ తోనే యూట్యూబ్ రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. యూట్యూబ్ లో విడుదలైన గంటలో మిలియన్ వ్యూస్, 24గంటల్లో 30మిలియన్స్ ఇలాంటి టార్గెట్స్ అందుకుంటున్నాయి. కానీ మూడేళ్లక్రితం విడుదలైన స్టార్ హీరో మూవీ తాజాగా యూట్యూబ్ 100మిలియన్స్ క్లబ్ లో చేరింది. స్టార్ హీరో అల్లు అర్జున్ - పూజాహెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన ఫస్ట్ మూవీ దువ్వాడ జగన్నాధం. 2017లో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎక్సపెక్ట్ చేసిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది. కానీ సాంగ్స్ పరంగా డీజే ఓ రేంజిలో ఊపేసింది.

అయితే కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. ఫుల్ లెన్త్ యాక్షన్ మూవీగా దువ్వాడ జగన్నాధంను భారీ కమర్షియల్ హంగులతో రూపొందించారు మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ముఖ్యంగా గుడిలో బడిలో, మెచ్చుకో, డీజే, సీటిమార్ ఇలా అన్ని సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. అయితే స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఈ సినిమాలో ఫస్ట్ టైం బికినీలో కనిపించి టోటల్ గా సాంగ్స్ లో అందాలను ఓ రేంజిలో ఆరబోసింది. మొత్తానికి డీజే 100మిలియన్స్ వ్యూస్ క్లబ్బులో చేరినందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.