Begin typing your search above and press return to search.

నార్త్ లో బన్నీ హవా

By:  Tupaki Desk   |   17 Nov 2017 8:16 AM GMT
నార్త్ లో బన్నీ హవా
X
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు ఈ మధ్య కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. అయితే థియేటర్స్ వరకు కాదు గాని బుల్లి తెరపై వచ్చినప్పుడు మంచి రేటింగ్ ను అందుకుంటున్నాయి. దీంతో తెలుగు సినిమాలను ఎక్కువగా డబ్ చేస్తూ.. కొందరు సోషల్ మీడియా ఛానెల్స్ లో కూడా రిలీజ్ చేసుకుంటున్నారు. వాటిలో ఎక్కువగా యాక్షన్ సినిమాలే ఉన్నాయి. టాలీవుడ్ యాక్షన్ సినిమాలను నార్త్ ఆడియెన్స్ చాలా ఇష్టపడతారు.

అయితే అదే అదే తరహాలో బన్నీ సినిమాలు కూడా నార్త్ లో మంచి ఆదరణను అందుకుంటున్నాయి. సరైనోడు సినిమా టాలీవుడ్ లో ఏ స్థాయిలో కలక్షన్లు కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. గత ఏడాది ఏప్రిల్ లో సినిమా రిలీజ్ అయ్యింది. అయితే మళ్లీ ఏడాది తర్వాత ఈ సంవత్సరం మే లో అదే టైటిల్ తో హిందీలో డబ్ అయ్యింది. యూట్యూబ్ లో సినిమాను రిలీజ్ చేయగా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇప్పటివరకు హిందీ లో డబ్ అయిన సినిమా అందుకొని వ్యూవ్స్ ని అందుకుంది. మొత్తంగా 100 మిలియన్స్ మార్క్ ని సరైనోడు మూవీ అందుకోంది. సినిమాలో ఊర మాస్ యాక్షన్ సీన్స్ నార్త్ ప్రజలకు బాగా నచ్చేయడంతో సినిమాని షేర్ కూడా చేసుకుంటున్నారు. అంతే కాకుండా బన్నీ డ్యాన్సులు నచ్చాయని కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే బన్నీ సౌత్ ఇండస్ట్రీలలో మంచి ఆదరణను దక్కించుకుంటున్నాడు. ఇక సరైనోడు హవా చూస్తుంటే నార్త్ ని కూడా టార్గెట్ చేస్తాడెమో..