Begin typing your search above and press return to search.

100 మిలియన్ క్లబ్.. రామ్ పోతినేని నెంబర్ 1!

By:  Tupaki Desk   |   21 Dec 2022 2:30 AM GMT
100 మిలియన్ క్లబ్.. రామ్ పోతినేని నెంబర్ 1!
X
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఇటీవల ది వారియల్ సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మాస్ కమర్షియల్ సినిమాగా వచ్చిన ది వారియర్ సినిమాను తమిళ దర్శకుడు లింగస్వామి రెండు భాషల్లో తెరకెక్కించాడు. తప్పకుండా ఈ సినిమాతో తమిళంలో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు. కానీ సినిమా అంతగా ఆడలేదు. అయితే ఆ సినిమా యూట్యూబ్ లో మాత్రం ఒక సంచలనం క్రియేట్ చేసింది.

రామ్ పోతినేని హిందీ డబ్బింగ్ సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల సినిమాను కూడా యూట్యూబ్లో హిందీలో డబ్ చేసి విడుదల చేయగా ఏకంగా వంద మిలియన్ల వ్యూవ్స్ సొంతం చేసుకుంది. ఇంతకుముందు కూడా రామ్ పోతినేని నటించిన కొన్ని సినిమాలకు యూట్యూబ్లో 100 మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి. అందులో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉండడం విశేషం.

ముఖ్యంగా మొదటిసారి గణేష్ సినిమా తోనే రామ్ హిందీ ఆడియోన్స్ ను బాగా అట్రాక్ట్ చేశాడు. డీసెంట్ రొమాంటిక్ ఫిలిం గా వచ్చిన ఆ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. ఇక నేను శైలజ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా హిందీలో డబ్బింగ్ చేయగా యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూవ్స్ సొంతం చేసుకుంది.

అలాగే ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే, హైపర్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు కూడా హిందీ డబ్బింగ్ వెర్షన్ లో అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఆ సినిమాలు యూట్యూబ్లో 100 మిలియన్ల వ్యూవ్స్ సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ది వారియర్ సినిమాతో కూడా అదే తరహాలో వంద మిలియన్ల వ్యూవ్స్ అందుకోగా రామ్ పోతినేని ఒక రికార్డును క్రియేట్ చేశాడు.

సౌత్ ఇండస్ట్రీలోనే వరుసగా ఏడు హిందీ డబ్బింగ్ సినిమాలతో యూట్యూబ్లో 100 మిలియన్ల వ్యూవ్స్ సొంతం చేసుకున్న హీరోగా అతను రికార్డు క్రియేట్ చేశాడు. నెక్స్ట్ బోయపాటితో రామ్ డైరెక్ట్ గా ఫ్యాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. మరి ఆ సినిమా హిందీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.