Begin typing your search above and press return to search.

నైజాంలో 100.. సీడెడ్ లో 50..!

By:  Tupaki Desk   |   18 April 2022 7:28 AM GMT
నైజాంలో 100.. సీడెడ్ లో 50..!
X
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పీరియాడికల్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. ఎన్టీఆర్ - రామ్ చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలైన మూడు వారాల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద తన డామినేషన్ కొనసాగిస్తోంది. మార్చి 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు 1072 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

RRR సినిమా ఇప్పటికే అనేక సరికొత్త రికార్డులను సృష్టించింది. జక్కన్న గత చిత్రం 'బాహుబలి 2' రికార్డులను చాలా ఏరియాల్లో అధిగమించింది. ఒక్క నైజాం ప్రాంతంలోనే రూ. 109 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన తొలి సినిమాగా ట్రిపుల్ ఆర్ నిలిచింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా మరో మైలురాయిని అందుకుంది.

'ఆర్.ఆర్.ఆర్' మూవీ సీడెడ్ ప్రాంతంలో 50 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో సీడెడ్ లో ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే నుంచే ఈ మూవీ భారీ వసూళ్ల దిశగా దూసుకుపోయింది. పది రోజుల్లోనే 'బాహుబలి 2' లైఫ్ టైం కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. దీనికి అధిక టికెట్ రేట్లు మరియు అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ అవడం వంటి అంశాలు కలిసొచ్చాయని చెప్పొచ్చు.

నార్త్ ఇండియాలో RRR ప్రభావం గట్టిగానే కనిపించింది. ఇప్పటికే 250 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక యూఎస్ఏలో ఈ చిత్రం $14 మిలియన్లకు పైగా రాబట్టింది. దీంతో 'బాహుబలి 2' ($20+ మిలియన్స్) తర్వాత అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ సినిమాగా నిలిచింది.

ఓవరాల్ గా 'ఆర్.ఆర్.ఆర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూడవ ఇండియన్ సినిమాగా రికార్డుల కెక్కింది. 'దంగల్' (రూ. 2024 కోట్లు) - 'బాహుబలి 2' (రూ. 1810 కోట్లు) సినిమాలు దీని కంటే ముందున్నాయి. త్వరలో RRR చిత్రాన్ని చైనా - జపాన్ సహా 30కి పైగా దేశాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి లైఫ్ టైం రన్ లో ఈ మల్టీస్టారర్ ఎలాంటి వసూళ్ళు అందుకుంటుందో చూడాలి.

కాగా, 'RRR' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరిస్ - శ్రియ - సముద్ర ఖని - అలిసన్ డూడీ - రే స్టీవెన్‌సన్ - రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించగా.. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాశారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.