Begin typing your search above and press return to search.

హిందీలో 100 కోట్ల హీరోయిన్.. మళ్ళీ సౌత్ ఆఫర్స్ కోసం ట్రై చేస్తోందట..!

By:  Tupaki Desk   |   15 April 2021 7:00 PM IST
హిందీలో 100 కోట్ల హీరోయిన్.. మళ్ళీ సౌత్ ఆఫర్స్ కోసం ట్రై చేస్తోందట..!
X
సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను 'ఝుమ్మందినాధం' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆ తర్వాత 'మిస్టర్ పర్ఫెక్ట్' 'గుండెల్లో గోదారి' 'సాహసం' 'ఘాజీ' 'ఆనందో బ్రహ్మ' 'నీవెవరో' 'గేమ్ ఓవర్' వంటి చిత్రాలలో నటించింది. అయితే పదేళ్ల సినీ కెరీర్లో తాప్సీకి తెలుగులో ఒక్క సోలో బ్లాక్ బస్టర్ కూడా పడలేదనే అనుకోవాలి. దీనితో తెలుగులో సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో సత్తా చాటుతోంది. హిందీలో త‌న‌కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న తాప్సి..100 కోట్ల హీరోయిన్ అయిపోయింది. అయితే సౌత్ లో సాలిడ్ హిట్ కొట్టలేకపోయాననే కోరిక మాత్రం అలానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ బ్యూటీ సౌత్ లో కూడా త‌న సత్తా చాటుకునేందుకు ట్రై చేస్తోందని తెలుస్తోంది.

త‌మిళ‌, తెలుగు భాషల్లో తాప్సీ మ‌రో మారు ఎంట్రీ ఇవ్వ‌డానికి బాగా ట్రై చేస్తోందట. అయితే ఈసారి హీరోయిన్ గా కాకపోయినా.. విల‌న్ గా లేదా కంటెంట్ డ్రివెన్ సినిమాలతో రావాలని చూస్తోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ జీవితానికి శ్రీకారం చుట్టింది సౌత్ సినిమానేనని.. ఎంత బిజీగా ఉన్నా అక్కడ ఛాన్సెస్ వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పుకొచ్చింది. మరి త్వరలోనే ఈ బ్యూటీ సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి. ఇకపోతే తాప్సీ ప్రస్తుతం ఐదు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే 'హసీన్ దిల్ రుబా' 'రశ్మీ రాకెట్' 'లూప్ లపేటా' 'దొబారా' సినిమాలు షూటింగ్స్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అలానే తాప్సి టైటిల్ రోల్ పోషిస్తోన్న మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ 'శభాష్ మిథూ' చిత్రీకరణ దశలో ఉంది. ఇవన్నీ కూడా కంటెంట్ ఆధారిత సినిమాలే కావాడం గమనార్హం.