Begin typing your search above and press return to search.

సోగ్గాడి కోసం అంత ఖ‌ర్చు పెట్టారా?

By:  Tupaki Desk   |   23 Dec 2019 10:08 AM GMT
సోగ్గాడి కోసం అంత ఖ‌ర్చు పెట్టారా?
X
హీరో అవ్వ‌డం 100 జ‌న్మ‌ల పుణ్య‌ఫ‌లం! అన్నారు టాలీవుడ్ కి చెందిన‌ ఓ పెద్దాయ‌న‌. ఇది నిజ‌మేన‌ని నిరూపిస్తున్నాడు మిస్ట‌ర్ శ‌ర‌వ‌ణ‌న్. శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ హీరోగా ప‌రిచ‌యం అవుతుండ‌డం త‌మిళ‌నాడు స‌హా దేశ‌ వ్యాప్తంగా హాట్ టాపిక్. వ‌స్త్ర శ్రేణి .. బంగారు ఆభ‌ర‌ణాల వ్యాపారంలో ల‌బ్ధ ప్ర‌తిష్టులైన శ‌ర‌వ‌ణ గ్రూప్స్ వార‌స‌త్వంలోంచి శ‌ర‌వ‌ణన్ రాకుమారుడిలా బ‌రిలో దిగుతుండ‌డం చూస్తుంటే గ్లామ‌ర్ తేలు ఏ లెవ‌ల్లో కుట్టిందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఎంద‌రో స్టార్లు.. అంద‌రిలో నేనూ ఒక‌డిని అనుకున్న‌దే త‌డ‌వుగా ముఖానికి రంగేసుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డాడు. శ‌ర‌వ‌ణ‌న్ కోలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌లేదు. స‌రిక‌దా వ‌స్తూనే క్రేజీగా వెలిగిపోవాల‌ని చూస్తుండడం.. అందాల భామ‌ల‌తో రొమాన్స్ లో చెల‌రేగుతుండ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టికే ప‌లు యాడ్స్ లో న‌టించిన అత‌డు సొంత కంపెనీని ప్ర‌మోట్ చేసుకోవ‌డంలో ఎప్పుడూ ముందుంటాడు. ప్ర‌స్తుతం తాజాగా కోలీవుడ్ లో పెద్ద‌ సెల‌బ్రిటీ హోదా కోసం గ‌ట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఇటీవ‌లే సినిమా మొద‌లైంది.

ఇప్పుడు ఏకంగా 100 మంది డ్యాన్స‌ర్ల న‌డుమ అందాల‌ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ.. టింగు రంగ‌డిలా అత‌డు ఇచ్చిన ఫోజు ఇంట‌ర్నెట్ ని షేక్ చేసేస్తోంది. శ‌ర‌వ‌ణ భామా క‌లాపానికి సంబంధించిన సాంగ్ షూట్ జ‌రుగుతోంది. ఈ ఒక్క పాట కోసం 10కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌న్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో అఖిల్ లా.. శాండ‌ల్వుడ్ లో కుమార‌స్వామి వార‌సుడు జాగ్వార్ లా అత‌గాడు ఇస్తున్న ఎంట్రీ మామూలుగా లేదు. అయితే శ‌ర‌వ‌ణ‌న్ పోస్ట‌ర్లు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలోకి రావ‌డంతో అత‌డి లుక్స్ పై కామెంట్లు ఆ రేంజులోనే వెల్లువెత్తుతున్నాయి. ట్రోల‌ర్స్ య‌థావిధిగా త‌మ బుద్ధిని చూపించుకుంటున్నారు. వేటికీ వెర‌వ‌క శ‌ర‌వ‌ణన్ తాను అనుకున్న‌ది చేసి చూపెడుతున్నాడు. హీరో అవ్వ‌డం అన్న‌ది జ‌న్మ‌జ‌న్మ‌ల పుణ్య‌ఫ‌లం! అని ప‌క్కాగా ప్రూవ్ చేస్తున్నాడు.