Begin typing your search above and press return to search.

అక్కడ కూడా బన్నీ కోటీశ్వరుడే

By:  Tupaki Desk   |   4 Feb 2016 12:48 PM IST
అక్కడ కూడా బన్నీ కోటీశ్వరుడే
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ లోనే అందరికంటే ఎక్కువగా ఇంటెరాక్షన్లలో పాల్గునే హీరో. సోషల్ నెట్వర్కింగ్ ని సక్రమంగా వాడుకుంటున్న అతికొద్ది మంది తెలుగు హీరోలలో బన్నీ ఒకడు. ఇప్పుడంటే ట్విట్టర్ ఛానల్ పాపులర్ అయ్యి అందరూ ఇటువైపు మళ్ళారే గానీ అప్పట్లో ఫేస్ బుక్ అఫీషియల్ అకౌంటే తారలకు అభిమానులకు మధ్య మాధ్యమం.

అటువంటి ఫేస్ బుక్ అకౌంట్ లో తనకంటూ కోటి మంది ఫాలోవర్లను సంపాదించి అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. టాలీవుడ్ లోనే కాక సౌత్ ఇండియాలోనూ ఏ హీరో సాధించలేని ఫీట్ ని సాధించి వార్తలలో నిలిచాడు. తనకి అండగా వున్న అభిమానులకు బన్నీ కృతఙ్ఞతలు తెలుపడం విశేషం.

ఈ మేరకు అభిమానులకు కానుకగా అల్లు అర్జున్ పై తీసిన ఫోటో షూట్ ని తన పేజ్ లో ఈరోజు పోస్ట్ చేయనున్నట్టు సమాచారం. AlluArjun1CrFans అన్న హ్యాష్ ట్యాగ్ కూడా దేశవ్యాప్తంగా ట్రెండ్ అవ్వడం మరో విశేషం. కంగ్రాట్స్ బన్నీ..