Begin typing your search above and press return to search.

స్టార్ హీరో మూవీ సెట్ లో ఆర్ట్‌ డైరెక్టర్ మృతి

అనూహ్యంగా ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్ మిలన్ సెట్స్‌ లో మృతి చెందడం తమిళ సినీ ఇండస్ట్రీని దుఃఖం లో ముంచింది.

By:  Tupaki Desk   |   16 Oct 2023 6:18 AM GMT
స్టార్ హీరో మూవీ సెట్ లో ఆర్ట్‌ డైరెక్టర్ మృతి
X

తమిళ్‌ స్టార్‌ హీరో అజిత్‌ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ జరుగుతూ ఉండగా విషాదం చోటు చేసుకుంది. అనూహ్యంగా ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్ మిలన్ సెట్స్‌ లో మృతి చెందడం తమిళ సినీ ఇండస్ట్రీని దుఃఖం లో ముంచింది. అజిత్‌ ప్రస్తుత చిత్రం కోసం మిలన్ ఆర్ట్స్ వర్క్‌ చేస్తూ ఉన్నాడు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

మిలన్‌ మృతి పట్ల సినీ ప్రముఖులు పలువురు విచారం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

సినిమా షూటింగ్‌ కు బ్రేక్‌ ఇవ్వడంతో పాటు యూనిట్ సభ్యులు అంతా కూడా మిలన్‌ తుది జర్నీ లో పాల్గొనబోతున్నట్లుగా తమిళ సినీ మరియు మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

పెద్ద అనారోగ్య సమస్యలు ఏమీ లేని మిలన్‌ సెట్స్ లో పని ఒత్తిడి వల్ల గుండెపోటుకు గురై మృతి చెందాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మరో రకంగా ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి మిలన్‌ యొక్క మృతి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.

సాబు సిరిల్‌ కి అసిస్టెంట్‌ డైరెక్టర్ గా సినీ కెరీర్‌ ను అరంభించిన మిలన్‌ ఆర్ట్‌ డైరెక్టర్ గా ప్రొడక్షన్‌ డిజైనర్ గా సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీ లో సేవలు అందిస్తున్నాడు. రెండు దశాబ్దాలుగా వందల కొద్ది సినిమాలకు వర్క్‌ చేసిన మిలన్‌ ఇలా అర్థాంతరంగా మృతి చెందడం పట్ల ఆయన సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌ స్టార్ నుంచి చిన్న హీరోల వరకు అందరి సినిమాలకు వర్క్ చేసిన ఘనత మిలన్ కి దక్కింది.