Begin typing your search above and press return to search.

సుస్సానే.. ప్రేమ ఎంత మ‌ధురం..

గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మాజీ భార్య, డిజైనర్ సుస్సానే ఖాన్ త‌న ప్ర‌స్తుత‌ భాగస్వామి అర్స్లాన్ గోనీ జంట అన్యోన్య‌త అన్నివేళ‌లా హాట్ టాపిక్

By:  Tupaki Desk   |   19 Dec 2023 12:26 PM GMT
సుస్సానే.. ప్రేమ ఎంత మ‌ధురం..
X

గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మాజీ భార్య, డిజైనర్ సుస్సానే ఖాన్ త‌న ప్ర‌స్తుత‌ భాగస్వామి అర్స్లాన్ గోనీ జంట అన్యోన్య‌త అన్నివేళ‌లా హాట్ టాపిక్. త‌మ అనుబంధానికి సంబంధించిన అరుదైన ఫోటోలు వీడియోలను సుస్సానే త‌న సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. ఇటీవల వెకేష‌న్ నుంచి కొన్ని ఫోటోలను సుసానే సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి.


తాజా ఫోటోగ్రాఫ్ లో సుస్సాన్ -అర్స్లాన్‌తో కలిసి అందంగా పోజులిచ్చింది. సుస్సాన్ త‌న ప్రియుడితో గొప్ప అనుంబంధాన్ని క‌లిగి ఉంది. అదే స‌మ‌యంలో ఆమె మాజీ భర్త బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రస్తుతం న‌టి కం గాయ‌ని సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరూ అప్ప‌ట్లో ద‌ర్శ‌క‌నిర్మాత కరణ్ జోహార్ గ్రాండ్ బర్త్ డే బాష్‌లో సంద‌డి చేసిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. విదేశీ వెకేష‌న్ల నుంచి ప్రియురాలితో హృతిక్ షికార్ల‌కు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఇక‌పోతే ప్ర‌తి నిమిషం సాబాతో త‌న అనుబంధానికి సంబంధించిన చాలా సంగ‌తుల్ని హృతిక్ సామాజిక మాధ్య‌మాల్లో వెల్లడిస్తున్నారు.


తాజాగా సుస్సానే- గోని జంట‌గా ఉన్న ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోలో జంట అనుబంధాన్ని చూసిన నెటిజ‌నులు ప్రేమ ఎంత మ‌ధురం! అంటూ ప్ర‌శంసిస్తున్నారు. ఈరోజు అర్ల్సాన్ గోని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సుస్సానే ప్ర‌త్యేకంగా పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలిపింది.


నిజానికి సుస్సానే - హృతిక్ చిన్ననాటి ప్రేమికులు. 2000లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకునే ముందు కొంతకాలం డేటింగ్ చేశారు. వారి వివాహ బంధం 14 సంవత్సరాల పాటు స్థిరంగా కొనసాగింది. ఈ జంట 2014లో విడిపోయారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారులు హృదాన్ - హ్రేహాన్ రోషన్ పెరిగి పెద్ద‌వాళ్ల‌వుతున్నారు. పిల్ల‌ల‌కు స‌హ‌త‌ల్లిదండ్రులుగా ఈ జంట ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. హృతిక్ రోషన్ త‌దుప‌రి దీపికా పదుకొనేతో క‌లిసి యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్ 'ఫైటర్‌'లో న‌టిస్తున్నాడు. టైగర్ ష్రాఫ్‌తో కలిసి బ్లాక్‌బస్టర్ యాక్షన్ వార్‌లో చివరిగా కనిపించాడు. త‌దుప‌రి వార్ 2లో హృతిక్ రోష‌న్ తో క‌లిసి ఎన్టీఆర్ తెర‌పై క‌నిపించ‌నున్నారు.