వైరల్ వీడియో : హీరోయిన్ బైసిప్స్, అతడు షాక్
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'వెల్కమ్' ఫ్రాంచైజీలో మూడవ చిత్రం 'వెల్కమ్ టు ది జంగిల్' విడుదలకు రెడీ అయ్యింది. జూన్ 26, 2026న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
By: Ramesh Palla | 13 Jun 2026 12:36 PM ISTబాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'వెల్కమ్' ఫ్రాంచైజీలో మూడవ చిత్రం 'వెల్కమ్ టు ది జంగిల్' విడుదలకు రెడీ అయ్యింది. జూన్ 26, 2026న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సునీల్ శెట్టి, పరేష్ రావల్, రవీనా టాండన్, దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్షద్ వార్సీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ దిశా పటానీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. గ్రీన్ కలర్ ఔట్ ఫిట్‌లో దిశా అందరి దృష్టిని ఆకర్షించింది. దిశా పటానీ తన ఔట్ ఫిట్‌తో మాత్రమే కాకుండా తన తోటి నటీ నటులతో మాట్లాడుతూ, వారిని ఆట పట్టిస్తూ మీడియా కెమెరా ల కంట పడింది. ముఖ్యంగా అర్షద్ వార్సీతో ఈమె సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వెల్‌కమ్ టు ది జంగిల్ మూవీ రిలీజ్...
'వెల్‌కమ్ టు ది జంగిల్' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో గెస్ట్‌లు మాట్లాడుతూ ఉండగా, వాటిని పట్టించుకోకుండా దిశా పటానీ, అర్షద్ వార్సీలు మాట్లాడుకోవడం కనిపించింది. అర్షద్ కి సరదాగా తన బైసిప్స్‌ను చూపించిన దిశా పటానీ తాను స్ట్రాంగ్ అన్నట్లుగా చెప్పకనే చెప్పింది. ఆ సమయంలో ఆమె బైసిప్స్ చూసిన అర్షద్ వార్సీ వావ్ నీ కండలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయంటూ ఆశ్చర్యపోయినట్లుగా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. దాంతో దిశ బిగ్గరగా నవ్వడం వీడియోలో చూడవచ్చు. ఈ వెంట్‌లో దిశ పటానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంటే, ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో మరింతగా చర్చనీయాంశం అయ్యింది. దిశా తన తోటి నటీనటులతో చిల్‌గా ఉంటుంది. ఆమె అందరితోనూ సన్నిహితంగా ఉంటుందని అంటారు. ఈ వీడియోను చూస్తే అది నిజమే అనిపిస్తుందని చాలా మంది ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకుంటున్నారు.
అక్షయ్ కుమార్ హీరోగా....
తాజాగా జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక కోసం నిర్మాతలు దాదాపుగా రూ.1.50 కోట్లు ఖర్చు చేసినట్లుగా బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈమధ్య కాలంలో ఈ స్థాయిలో బాలీవుడ్ సినిమా ప్రమోషన్ ఖర్చు చేయడం, అది కూడా ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఈ స్థాయిలో ఖర్చు చేయడంతో సినిమా గురించి మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు ఏకంగా 30 మంది కనిపించబోతున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు వచ్చిన బాలీవుడ్ సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ మూవీ అనే ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో లేదని, వసూళ్లు గతంతో పోల్చితే తగ్గాయనే విషయం తెల్సిందే. అయినా కూడా ఈ సినిమా సబ్జెక్ట్ పై నమ్మకంతో దర్శకుడు అహ్మద్ ఖాన్ భారీ మొత్తంలో ఖర్చు చేసి మరీ రూపొందించాడని సమాచారం అందుతోంది.
ప్రభాస్ కల్కి మూవీలో దిశా పటానీ..
ఇక దిశా పటానీ విషయానికి వస్తే ఈ ఏడాది వెల్ కమ్ టు ది జంగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతే కాకుండా హాలీవుడ్ మూవీ హోలీగార్డ్స్ సాగా: ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్ లో నటిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ స్టార్ కెవిన్ స్పేసీతో కలిసి ఈ చిత్రంలో దిశా కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే ఈ ఏడాదిలో ఓ రోమియో సినిమాలో నటించి కనిపించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. తెలుగులో ఈమె మళ్లీ నటించేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికీ గత చిత్రం కల్కిలో ఈమె పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగులో ఈమె మళ్లీ ఎప్పటికి నటించేను అనేది క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం పూర్తి దృష్టి హిందీ సినిమాలపై ఉందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. హాలీవుడ్ నుంచి మరిన్ని ఆఫర్లు వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది. మొత్తానికి దిశా పటానీ హీరోయిన్‌గానే కాకుండా ఇలా వైరల్ వీడియోల వల్ల కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటుంది. ఇక రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా ఇప్పటికే చాలా పాపులర్ అయిన విషయం తెల్సిందే.
