Begin typing your search above and press return to search.

దిగొచ్చి అన్నింటిక్ చెక్ పెట్టిన లెజెండ్!

'సైరా న‌ర‌సింహారెడ్డి' చిత్రానికి ఏ.ఆర్ . రెహమాన్ సంగీతం అందించ‌లేదు! అన్న కార‌ణంగా అత‌నిపై ఏ రేంజ్ లో విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌చ్చాయో తెలిసిందే

By:  Tupaki Desk   |   21 March 2024 1:30 PM GMT
దిగొచ్చి అన్నింటిక్ చెక్ పెట్టిన లెజెండ్!
X

'సైరా న‌ర‌సింహారెడ్డి' చిత్రానికి ఏ.ఆర్ . రెహమాన్ సంగీతం అందించ‌లేదు! అన్న కార‌ణంగా అత‌నిపై ఏ రేంజ్ లో విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌చ్చాయో తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ముందు ఆయ‌న క‌మిట్ అవుతున్న‌ట్లు గా..ఆ త‌ర్వాత బిజీ షెడ్యూల్ కార‌ణంగా చేయ‌లేక‌పోతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించిన త‌ర్వాత తెలుగు మీడియాలో తీవ్ర స్థాయిలో వ్య‌తిరేక‌త వ్య‌క్తమైంది. అందుకు కార‌ణం లేక‌పోలేదు.

కోలీవుడ్ లో అంత‌క‌న్నా చిన్న సినిమాలు..విదేశాల్లో కచేరీల‌కంటే మెగాస్టార్ సినిమా చిన్న‌దా? అన్న కోణంలో రెహ‌మాన్ పై దాడి మొద‌లైంది. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కి వాతావ‌ర‌ణ‌మంతా కూల్ అయింది. అటుపై రామ్ చ‌ర‌ణ్ సినిమాకి రెహాన్ సంగీతం అందిస్తున్నాడు? అన్న వార్త అభిమానుల్లో మ‌రింత సంతోషంగా క‌నిపించింది. తండ్రి తో చేయ‌లేక‌పోయినా ఇప్పుడు త‌న‌యుడితో చేస్తున్నాడని రెహ‌మాన్ పై పాజిటివ్ వైబ్ మొద‌లైంది.

అయితే నిన్న‌టి రోజున రెహమాన్ హైద‌రాబాద్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం అన్న‌ది అంద‌ర్నీ విస్మ‌యానికి గురి చేసింది. చెన్నై... ముంబై.. బెంగుళూరులో మాత్ర‌మే తిరిగే రెహమాన్ హైద‌రాబాద్ లో ఏంటి? అని చాలా మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసారు. మీడియా స‌ర్కిల్స్ లో వాడి వేడి చ‌ర్చ‌కు తెర తీసింది. నిన్న‌టి రోజున రెహ‌మాన్ కేవ‌లం చ‌ర‌ణ్ సినిమా లాంచింగ్ కోస‌మే చెన్నై నుంచి రావ‌డం అభిమానుల్ని మ‌రింత సంతోషానికి గురి చేస్తుంది. రెహమాన్ హైదారాబాద్ వ‌చ్చింది చాలా త‌క్కువ సంద‌ర్భాల్లోనే.

ఏవైనా త‌మిళ సినిమాలకు సంగీతం అందిస్తే అవి తెలుగులో అనువాద‌మై రిలీజ్ అవుతున్నాయంటే? త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో వాటి ప్ర‌చారంలో పాల్గొంటారు. ఆయ‌న ఎక్కువ‌గా ప‌నిచేసేది కూడా మ‌ణిర‌త్నం ..శంక‌ర్ సినిమాల‌కే. ఆ ఇద్ద‌రి ద‌ర్శ‌కుల సినిమాలు కూడా రెండు..మూడేళ్ల‌కు ఒక‌టి రిలీజ్ అవుతుం టుంది. అప్పుడే క‌నిపిస్తుంటారు. అంత బిజీగా ఉండే శంక‌ర్ నిన్న‌టి రోజున బుచ్చిబాబు-చ‌ర‌ణ్ సినిమాకి రావ‌డం - ఇంట‌రాక్ష‌న్ అంతా సర్ ప్రైజింగ్ గానే అనిపిస్తుంది. నిన్న‌టి రాక‌తో రెహమాన్ పై ఉన్న నెగివిటీ పూర్తిగా తొల‌గిపోతుంది.