Begin typing your search above and press return to search.

#RC 16 రెహ‌మాన్ 3 పాట‌లు రెడీ

రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న తాజా చిత్రం RC 16

By:  Tupaki Desk   |   28 March 2024 4:53 AM GMT
#RC 16 రెహ‌మాన్ 3 పాట‌లు రెడీ
X

రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న తాజా చిత్రం RC 16. మైత్రి మూవీ మేక‌ర్స్ -విద్ధి సినిమాస్- సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి ఆస్కార్ గ్ర‌హీత సంగీత సంచ‌ల‌నం ఏ.ఆర్.రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే ఈవెంట్లో ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు మాట్లాడుతూ .. సినిమాకి సంబంధించి మూడు పాట‌లు రెడీ అయ్యాయ‌ని తెలిపారు. బుచ్చిబాబు మాట్లాడుతూ-'' ఏ.ఆర్.రెహ‌మాన్ అద్భుత‌మైన మూడు పాట‌లు రెడీ చేసారు. నాకు పాట‌లు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఉప్పెన‌కు దేవీశ్రీ ఎలాంటి పాట‌లు ఇచ్చారో మీరు చూసారు. రెహ‌మాన్ గారు దానికి మించి అద్భుత‌మైన పాట‌ల్ని అందించారు'' అని తెలిపారు. చ‌ర‌ణ్ త‌న‌కు అద్భుత‌మైన అవ‌కాశం క‌ల్పించారు. మ‌రోసారి తాను నిరూపిస్తాన‌ని బుచ్చిబాబు అన్నారు.

మైత్రి మూవీ మేక‌ర్స్ అధినేత‌ ర‌వి శంక‌ర్ మాట్లాడుతూ- ఈ ఏడాది వ‌ర‌స సినిమాల్ని ప్ర‌క‌టించే అవ‌కాశం క‌లిగింది. రామ్ చ‌ర‌ణ్ గారికి ఇది చాలా ప్ర‌త్యేకమైన‌ బ‌ర్త్ డే.. రంగ‌స్థ‌లం సినిమా తీసేప్పుడు లైఫ్ లాంగ్ సెల‌బ్రేట్ చేసుకుంటామ‌నుకున్నాం. ఆ చిత్రం అంద‌రి గుండెల్లో నిలిచిపోయింది. అలాంటి సినిమాకి ప‌ని చేసే అవ‌కాశం ఇచ్చినందుకు చ‌ర‌ణ్ కి థాంక్స్ . ఇప్పుడు మాకు అవ‌కాశం ఇచ్చిన సినిమాల‌ను మేం పెద్ద హిట్ చేస్తాం. నిరూపిస్తాం'' అని అన్నారు.

న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ-''చ‌ర‌ణ్ గారికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. మా బ్యాన‌ర్ లో చ‌ర‌ణ్‌- బుచ్చిబాబు సినిమా, అలాగే సుకుమార్ -చ‌ర‌ణ్ సినిమా అనౌన్స్ మెంట్ చేసాం. చాలా సంతోషం.. రెండు పెద్ద సినిమాలు .. పెద్ద విజ‌యాలు సాధిస్తాయి. మీ బ‌ర్త్ డేకి మాకు రెండు పెద్ద కానుక‌లిచ్చినందుకు థాంక్స్. అన్ని రికార్డుల్ని బ్రేక్ చేసేలా ప‌ని చేస్తాం'' అని అన్నారు. రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బుచ్చిబాబు తెర‌కెక్కిస్తున్న ఆర్.సి 16 టైటిల్ ని ప్ర‌క‌టించాల్సి ఉంది. ఈ సినిమా క్రీడ‌ల నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే చిత్ర‌మ‌ని క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.