Begin typing your search above and press return to search.

IPL 2024 కోసం ఆస్కార్ గ్ర‌హీత రెహ‌మాన్ ఫీజు?

AR రెహమాన్ స్వయంగా తన కుమారుడు AR అమీన్‌తో కలిసి ఉత్కంఠభరితమైన పాట‌తో ర‌క్తి క‌ట్టించారు.

By:  Tupaki Desk   |   25 March 2024 4:00 AM GMT
IPL 2024 కోసం ఆస్కార్ గ్ర‌హీత రెహ‌మాన్ ఫీజు?
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్రారంభ వేడుకలు అద్భుతంగా సాగగా..ఈ మహోత్సవంలో బాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో పాటు, సంగీత పరిశ్రమలోని కొంద‌రు దిగ్గ‌జాలు పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఆస్కార్ గ్ర‌హీత‌, స్వ‌ర‌మాంత్రికుడు ఏ.ఆర్.రెహ‌మాన్ స‌హా ప్రఖ్యాత గాయనీగాయ‌కుల మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనలతో వేదిక ఉర్రూత‌లూగించింది. ఈసారి ఐపీఎల్ వేడుక‌లు ప్రేక్షకులకు మరపురాని అనుభూతినిచ్చాయి.

IPL 2024 ప్రారంభ వేడుకలో టాప్ సింగర్స్ ప్రదర్శన అహూతుల‌ను రంజింప‌జేసింది. లెజెండరీ ఏఆర్ రెహమాన్ తన అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో వేదికకు ప్ర‌త్యేక క‌ళ తెచ్చారు. అతడు తన ఐకానిక్ ట్రాక్ `మా తుజే సలామ్‌..`తో కాన్సెర్ట్ ని ప్రారంభించారు. తనదైన తాంత్రిక‌ గాత్రంతో ప్రేక్షకులను ఆకర్షించాడు. కానీ దానికి మించి ఏఆర్ రెహమాన్ సోనూ నిగమ్‌తో కలిసి `దిల్ సే` నుండి `సత్రంగి రే` అల‌రించింది. వీరిద్దరి కెమిస్ట్రీ వేదికను ఉర్రూతలూగించింది. గాయ‌ని నీతి మోహన్ తన ఐకానిక్ రెహమాన్ `బర్సో రే` పాటతో ప్రేక్షకులను అబ్బురపరిచింది. పాపుల‌ర్ గాయ‌ని మంత్రముగ్ధులను చేసే స్వరం స్టేడియంలో ప్రతిధ్వనించింది. అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే స్వ‌రంతో నీతి ఆక‌ట్టుకున్నారు. AR రెహమాన్ స్వయంగా తన కుమారుడు AR అమీన్‌తో కలిసి ఉత్కంఠభరితమైన పాట‌తో ర‌క్తి క‌ట్టించారు.

లైవ్ పెర్ఫామెన్స్ స‌రే కానీ, దీనికోసం ఒక్కొక్క ప్ర‌ముఖుడు ఎంత పారితోషికం తీసుకున్నారు? అన్న‌ది చూస్తే క‌ళ్లు తిరిగే నిజాలు తెలిసాయి. AR రెహమాన్ ఈ కచేరీ కోసం అందుకున్న‌ ఫీజు సుమారు 2 కోట్లు.

ఒక చిత్రానికి సంగీతం అందించడానికి రెహమాన్ 8 నుండి 10 కోట్ల రూపాయల వరకు తీసుకుంటారు. ఒక గంట సంగీత కచేరీకి అతడి రుసుము 1 నుండి 2 కోట్ల వరకు ఉంటుంది. సోను నిగమ్ లైవ్ పెర్‌ఫార్మెన్స్‌లతో ఉర్రూత‌లూగించే గాయ‌కుడిగా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న‌వాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి సోనూ నిగమ్ ఒక్కో ఈవెంట్ పెర్ఫార్మెన్స్ కోసం రూ. 80 లక్షల నుండి 1 కోటి వరకు రుసుమును కమాండ్ చేస్తారు.

లైవ్ క‌చేరీలో పాల్గొన్న పాపుల‌ర్ గాయ‌కుడు మోహిత్ చౌహాన్ .. ఒక కచేరీకి లేదా ఈవెంట్‌లో ప్రదర్శన ఇవ్వడానికి దాదాపు రూ. 22 నుండి 30 లక్షలు వసూలు చేస్తాడు. అందాల గాయ‌ని నీతిమోహ‌న్ ఒక్కో ఈవెంట్ కోసం దాదాపు 18 నుండి 20 లక్షలు అందుకుంటారు. ఐపీఎల్ ఈవెంట్ కోసం వారంతా ఆశించిన ఫీజును ద‌క్కించుకున్నారు. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోని చాలామంది గాయ‌నీమ‌ణులు ల‌క్ష‌ల్లో అందుకునేవారు ఉన్నారు. సింగ‌ర్ సునీత స‌హా ప‌లువురు ల‌క్ష‌ల్లో అందుకుంటున్నారు. అయితే మిడ్ రేంజ్ గాయ‌నీగాయ‌కులు మాత్రం వేల‌ల్లో అందుకుంటున్నార‌న్న స‌మాచారం ఉంది.