Begin typing your search above and press return to search.

రెహమాన్ వరుస ప్రాజెక్ట్స్‌... ఏంటి విశేషం?

రెహమాన్‌ ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పటితో పోల్చితే రెహమాన్‌ రిలీజ్‌లు ముందు ముందు ఎక్కువగా ఉండబోతున్నాయి.

By:  Tupaki Desk   |   21 April 2025 11:05 AM IST
AR Rahman Busy With Current Lineups
X

ఆస్కార్ అవార్డ్‌ గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ మరో సౌత్ సినిమాకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పటికే తెలుగులో రామ్‌ చరణ్, బుచ్చి బాబు కాంబోలో రూపొందుతున్న 'పెద్ది' సినిమాకు రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌పై ఎక్కువ దృష్టి పెట్టి హిందీ సినిమాలను ఎక్కువగా చేసిన రెహమాన్‌ మధ్య మధ్యలో మాత్రమే సౌత్ ఇండియన్‌ సినిమాలు చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు సౌత్‌ ఇండియాలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. రామ్‌ చరణ్ పెద్ది సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఆ సినిమా కోసం రెహమాన్‌ ఒక వైపు వర్క్ చేస్తున్నాడు. ఈ సమయంలోనే మరో సౌత్ ఇండియన్‌ సినిమాకు రెహమాన్ సంగీతాన్ని అందించేందుకు ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి.

రెహమాన్‌ ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పటితో పోల్చితే రెహమాన్‌ రిలీజ్‌లు ముందు ముందు ఎక్కువగా ఉండబోతున్నాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసే విధంగా రెహమాన్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. హిందీ సినిమాలు చేస్తూనే తెలుగు, తమిళ్ సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్న రెహమాన్ ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న సంగీత దర్శకుడిగా నిలిచాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తున్న రెహమాన్‌ పలు విదేశీ సినిమాలకు సైతం సంగీతాన్ని అందించిన దాఖలాలు ఉన్నాయి.

తాజాగా ధనుష్ హీరోగా రూపొందుతున్న D56 సినిమాకు గాను రెహమాన్ సంగీతాన్ని అందించేందుకు ఓకే చెప్పాడట. మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌లో రూపొందుతున్న ధనుష్ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా సెల్వరాజ్‌, ధనుష్‌ కాంబో మూవీ అంటే అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన సినిమాలకు మంచి స్పందన దక్కడంతో పాటు, కమర్షియల్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఇప్పుడు D56 సినిమాపై తమిళ్‌ ప్రేక్షకుల్లోనే కాకుండా పాన్‌ ఇండియా ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. దానికి తోడు రెహమాన్ సంగీతం అందించబోతున్న నేపథ్యంలో D56 హైప్ మరింత పెరిగింది.

ధనుష్, రెహమాన్ కాంబోలో ఇప్పటి వరకు రాంఝానా, అంత్రంగి రే, మార్యన్‌, రాయన్‌ సినిమాలు వచ్చాయి. ప్రతి సినిమా మ్యూజికల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమా కూడా మ్యూజికల్‌ హిట్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ధనుష్‌ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వచ్చిన సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా మారి సెల్వరాజ్‌ సినిమాలను రూపొందించబోతున్నారట. ధనుష్‌ త్వరలో 'కుబేరా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను సైతం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వచ్చే ఏడాది మరో మూడు సినిమాలను ధనుష్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.