Begin typing your search above and press return to search.

యాక్ష‌న్ కింగ్ కుమార్తె పెళ్లి బాజా.. వ‌రుడెవ‌రు?

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఐశ్వర్య జీవిత భాగస్వామిగా ప్ర‌చారంలో ఉన్న అత‌డు కోలీవుడ్ లో లెజెండరీ క్యారెక్టర్ న‌టుడు తంబి రామయ్య కొడుకు అని రివీలైంది.

By:  Tupaki Desk   |   27 Oct 2023 4:37 PM GMT
యాక్ష‌న్ కింగ్ కుమార్తె పెళ్లి బాజా.. వ‌రుడెవ‌రు?
X

సౌతిండియాలో వెర్స‌టైల్ స్టార్, యాక్షన్ కింగ్ అర్జున్ ఇటీవ‌ల విల‌న్ పాత్ర‌ల‌తోను మెరిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ద‌శాబ్ధాల కెరీర్ లో ప‌రిశ్ర‌మ‌లో అగ్ర హీరోగా కొన‌సాగిన అర్జున్ వెర్స‌టైలిటీకి వీరాభిమానులున్నారు. లేటెస్ట్ తమిళ బ్లాక్ బస్టర్ 'లియో'లో హెరాల్డ్ దాస్ అనే భయంకరమైన విల‌న్ పాత్రను అర్జున్ పోషించాడు. ఇందులో ద‌ళ‌పతి విజయ్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు.

అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య అర్జున్ కూడా తండ్రి బాటలోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2013లో విశాల్ 'ప‌ట్టతు యానై'లో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తన తండ్రి దర్శకత్వం ర‌చ‌న‌తో తెర‌కెక్కిన‌ కన్నడ రొమాంటిక్ డ్రామా 'ప్రేమ బరహా'లో క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రం తమిళంలో 'సొల్లివిడవ' పేరుతో విడుదలైంది.


న‌టిగా ఆరంగేట్రం ఆక‌ట్టుకున్నా కానీ, ఐశ్వర్య పెద్ద సినిమాల్లో న‌టించ‌లేక‌పోయింది. గత కొన్ని నెలలుగా ఐశ్వర్య ల‌వ్ లైఫ్ గురించి ఆసక్తికరమైన పుకార్లు షికార్ చేసాయి. ఒక పాపుల‌ర్ తమిళ నటుడి కొడుకుతో ప్రేమాయణం సాగిస్తోందని, వారి మ‌ధ్య చాలా కాలంగా ప్రేమాయ‌ణం సాగుతోంద‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఐశ్వర్య జీవిత భాగస్వామిగా ప్ర‌చారంలో ఉన్న అత‌డు కోలీవుడ్ లో లెజెండరీ క్యారెక్టర్ న‌టుడు తంబి రామయ్య కొడుకు అని రివీలైంది. మ‌ల్టీ ట్యాలెంటెడ్ ఆర్టిస్టుగా తంబి రామయ్యకు పేరుంది. ఆయ‌న పెద్ద కుమారుడు ఉమాపతి సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన ముద్ర వేస్తున్నాడు. 'అడగపట్టత్తు మగజనంగాలే-'మణియార్ కుటుంబం'- తిరుమానం-తన్నే వండి వంటి చిత్రాలలో అత‌డు ప్రధాన పాత్రలు పోషించారు.

ఐశ్వర్య - ఉమాపతి వివాహంతో తమ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ జంటకు కుటుంబ స‌భ్యుల‌ ఆశీర్వాదం ల‌భించింది. నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ చేసార‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది.

భక్తికి మారు పేరుగా పాపుల‌రైన‌ అర్జున్ 2021లో చెన్నైలో హనుమాన్ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో ఐశ్వర్య - ఉమాపతిల నిశ్చితార్థ వేడుక జర‌గ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ ఈవెంట్‌కు సన్నిహిత కుటుంబ సభ్యులు, ఎంపిక చేసిన స్నేహితుల బృందం మాత్రమే హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.