Begin typing your search above and press return to search.

లోకేష్‌ చెప్పాలే గాని ఏమైనా చేస్తా..!

ఈ మధ్య కాలంలో సౌత్‌ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అర్జున్ దాస్

By:  Tupaki Desk   |   6 May 2024 10:30 AM GMT
లోకేష్‌ చెప్పాలే గాని ఏమైనా చేస్తా..!
X

ఈ మధ్య కాలంలో సౌత్‌ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అర్జున్ దాస్. నటుడిగా ఈయన చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా ప్రతి పాత్ర కూడా ఎప్పటికి గుర్తుండి పోయేలా ఉంది అనడంలో సందేహం లేదు. హీరోలకు పోటీ అన్నట్లుగా ఫిజిక్ లో మరియు లుక్ లో అదరగొడుతున్న అర్జున్ దాస్ త్వరలో రసవాది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

రసవాది సినిమా ప్రమోషన్ లో భాగంగా అర్జున్ దాస్ మాట్లాడుతూ.. దుబాయ్ లో పనిచేసే తాను డబ్బింగ్ ఆర్టిస్టుగా చెన్నై లో వచ్చి స్థిరపడ్డాను. లోకేష్ సర్ 'ఖైదీ' సినిమాలో ఛాన్స్ ఇచ్చిన సమయంలో నా కెరీర్‌ ఇంతగా మలుపు తిరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు.

ఖైదీ మరియు మాస్టర్ సినిమాల్లో నటించిన పాత్రలు నాకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. అందుకే చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్‌ అలాంటి పాత్రలను మరియు అలాంటి కథలను మాత్రమే ఆఫర్‌ చేస్తున్నారు. కానీ నేను ఎక్కువ శాతం అలాంటి పాత్రలు చేయాలని కోరుకోవడం లేదని అన్నాడు.

నాకు లోకేష్ కనగరాజ్ అత్యంత ఆప్తుడు. ఒక వేళ మరోసారి లోకేష్ అలాంటి పాత్రను ఆఫర్ చేస్తే మాత్రం కచ్చితంగా ఓకే చెప్తాను. లోకేష్ చెప్పాలేగాని ఎలాంటి సినిమా అయినా, ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు రెడీగా ఉంటాను. హీరోగా ఎంత సక్సెస్ అయినా లోకేష్ అడిగితే విలన్ గా నటిస్తాను అన్నాడు.

హీరోగా అర్జున్‌ దాస్ చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతానికి ఆయనకు ఎంతటి ఇమేజ్ ను తెచ్చి పెడతాయి అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే కచ్చితంగా ముందు ముందు హీరోగా కాకున్నా మంచి పాత్రల్లో అయితే అర్జున్‌ దాస్ ను చూస్తామని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.