ఫ్లాపుల హీరో గ్యాంగ్ స్టర్ డ్రామా కిక్కిస్తుందా?
అంతగా క్రేజ్ లేని చిత్రాలకు బజ్ ఎలా పెంచాలో బాలీవుడ్ దర్శక నిర్మాతలకు స్పష్ఠంగా తెలుసు.
By: Tupaki Desk | 9 May 2025 4:00 AMఅంతగా క్రేజ్ లేని చిత్రాలకు బజ్ ఎలా పెంచాలో బాలీవుడ్ దర్శక నిర్మాతలకు స్పష్ఠంగా తెలుసు. ఇది అలాంటి ఒక ప్రచారమా? అంటూ ఇప్పుడు డౌట్లు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని వారాలుగా విశాల్ భరద్వాజ్ `అర్జున్ ఉస్తారా` షూటింగ్ ఆగిపోయిందని పుకార్లు వినిపిస్తున్నాయి. దీంతో ప్రాజెక్ట్ కి ఏమైంది? అంటూ జనం ప్రశ్నిస్తున్నారు.
నిజానికి షాహిద్ కపూర్ - త్రిప్తి దిమ్రీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షెడ్యూల్ ప్రకారం షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోందని తెలిపారు. ముంబై- బాంద్రాలో షూటింగ్ జరుగుతోంది. తారాగణం సిబ్బంది ప్రతిరోజూ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. షూట్ ఆగిపోతుందనే ప్రశ్నే లేదని యూనిట్ పేర్కొంది. అయితే అనవసరంగా ఈ పుకార్ ఎందుకు మొదలైనట్టు? ఏప్రిల్ ప్రారంభంలో ఒక ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించాల్సి ఉంది. కానీ ఆశించిన నృత్యకారులు అందుబాటులో లేనందున షెడ్యూల్ వాయిదా పడింది. కోరుకున్న వారు ఆ సమయంలో లేరు. అందువల్ల పాట లుక్ వైబ్ వర్కవుట్ కావని భావించినట్టు దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెలిపారు.
విశాల్ భరద్వాజ్ `అర్జున్ ఉస్తారా` చిత్రీకరణ జనవరి 2025లో ప్రారంభించారు. అప్పటి నుండి యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రీకరణ దశలో ఉంది. ఈపాటికే పూర్తి కావాల్సి ఉన్నా ఒక పాట చిత్రీకరణ వాయిదా పడింది. ఈ ప్రాజెక్ట్ జూన్ చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే అంతగా బజ్ లేని సినిమాకి ప్రచారం తెచ్చేందుకు భరద్వాజ్ టీమ్ ఇలాంటి ప్రచారాన్ని తెరపైకి తెస్తోందని నెటిజనులు వాదిస్తున్నారు. షాహిద్ కి మంచి మాస్ మసాలా కంటెంట్ ని అందిస్తున్న భరద్వాజ్ హిట్టు కొడతాడని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక గ్యాంగ్ స్టర్ స్టోరీతో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం.