భారతదేశంలో వేరే ఏ హీరోయిన్ చేయలేదు!- ఎన్టీఆర్
తాజాగా ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొన్న తారక్ వేదికపై ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో నటించిన సీనియర్ నటి విజయశాంతిపై ప్రశంసల వర్షం కురిపించారు.
By: Tupaki Desk | 12 April 2025 11:04 PM ISTనటసింహా నందమూరి బాలకృష్ణకు బెస్ట్ పెయిర్ ఎవరు? అంటే.. 'విజయశాంతి' అని ఠకీమని చెప్పేస్తారు అభిమానులు. ఇప్పుడు బాలయ్య హీరోయిన్ విజయశాంతి నందమూరి కళ్యాణ్ రామ్ కి తల్లిగా నటించడం ఆసక్తిని కలిగిస్తోంది. విజయశాంతి, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలు పోషించిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' చిత్రం ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటుందని, చివరి 20 నిమిషాల క్లైమాక్స్ థియేటర్లలో ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుందని అన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
తాజాగా ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొన్న తారక్ వేదికపై ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో నటించిన సీనియర్ నటి విజయశాంతిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. భారతదేశ సినీచరిత్రలో విజయశాంతి గారు సాధించినది మరో హీరోయిన్ సాధించలేదు. కేవలం తెలుగు సినీపరిశ్రమలోనే కాదు.. హీరోలతో సమానంగా నిలిచిన ఏకైక హీరోయిన్ భారతదేశంలో విజయశాంతి గారు ఒక్కరే. కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు సహా ఎన్నో చిత్రాల్లో యాక్షన్ పాత్రలతో అదరగొట్టారు అని ప్రశంసించారు.
విజయశాంతి గారిని తల్లిగా భావించిన అన్న కళ్యాణ్ రామ్ ఆమె కొడుకు పాత్రలో జీవించాడని, క్లైమాక్స్ లో అతడు కంట తడి పెట్టిస్తాడని కూడా ఎన్టీఆర్ అన్నారు. ఈనెల 18న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని తెలిపారు. కర్తవ్యంలో విజయశాంతికి కొడుకు పుడితే.. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' అని కూడా తారక్ సినిమాపై హైప్ పెంచారు.
