Begin typing your search above and press return to search.

వన్ టు టెన్ ఒక్కడే.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ టాక్..!

సినిమా ట్రైలర్ మాత్రం ఫుల్ ప్యాక్ మాస్ ఎంటర్టైనర్ గా అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ అన్ని విధాలుగా అదరగొట్టినట్టు ఉన్నాడు.

By:  Tupaki Desk   |   12 April 2025 11:03 PM IST
వన్ టు టెన్ ఒక్కడే.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ టాక్..!
X

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. ఈ నెల 18న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన వైజయంతి ఒక పక్క దుర్మాగుల ఆటలు కట్టిస్తుంటే.. ఆమె కొడుకైన అర్జున్ మాత్రం పెద్ద రౌడీగా చెలామని అవుతుంటాడు. ఈ టైం లో అర్జున్ ని వైజయంతి ఎలా మార్చింది. అసలు అర్జున్ ఎందుకు అలా తయారయ్యాడు. ఆ తర్వాత ఎలా మారాడు. అతను మారడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటి అన్నది అర్జున్ సన్నాఫ్ వైజయంతి కథ.

సినిమా ట్రైలర్ మాత్రం ఫుల్ ప్యాక్ మాస్ ఎంటర్టైనర్ గా అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ అన్ని విధాలుగా అదరగొట్టినట్టు ఉన్నాడు. ముఖ్యంగా విజయశాంతితో సీన్స్ చాలా ఎమోషనల్ గా అనిపించేలా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే ఇది ఉంది అది లేదు అన్నట్టు కాకుండా అన్నీ అంశాలు ఉన్నట్టు ఉన్నాయి. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఆడియన్స్ కి ఒక మంచి ట్రీట్ ఇచ్చేలా ఉంది.

ముఖ్యంగా యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించేలా ఉన్నాయి. సినిమాలో సెంటిమెంట్ కూడా ఎక్కువే ఉండేలా ఉంది. కళ్యాణ్ రామ్ చేసే మాస్ ఎంటర్టైనర్స్ మంచి ఫలితాలు ఇచ్చాయి. ఐతే ఆఫ్టర్ లాంగ్ టైం కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న ఈ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా అర్జున్ సన్నాఫ్ వైజయంతి స్పెషల్ గా రానుంది. అంతేకాదు ఈ సినిమాలో మదర్ అండ్ సన్ ఎమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యేలా ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తే పక్కా పైసా వసూల్ సినిమాగా అనిపిస్తుంది. మరి సినిమా ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుంది అన్నది చూడాలి.