Begin typing your search above and press return to search.

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి.. ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ రెడీ!

ఈ సినిమాను భారీ స్కేల్‌లో రూపొందించిన టీమ్, తాజాగా ఫైనల్ కాపీ లాక్ చేసిన తరువాత ఒక హ్యాపీ మూమెంట్ ను అభిమానులతో పంచుకుంది.

By:  Tupaki Desk   |   17 April 2025 7:20 AM
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి.. ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ రెడీ!
X

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ ద్వారా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఫైనల్ గా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమాను భారీ స్కేల్‌లో రూపొందించిన టీమ్, తాజాగా ఫైనల్ కాపీ లాక్ చేసిన తరువాత ఒక హ్యాపీ మూమెంట్ ను అభిమానులతో పంచుకుంది.


ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. "భారీ ఎమోషన్లు, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సినిమా" అని పేర్కొంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, కళ్యాణ్ రామ్‌తో పాటు టెక్నికల్ టీమ్ సభ్యులంతా కలిసి ఒక ఫోటోలో కనిపించారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హీరోకి విలన్‌గా సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ నటిస్తుండగా, కథానాయికగా సాయి మంజ్రేకర్ కనిపించనున్నారు. అర్జున్ పాత్రలో కళ్యాణ్ రామ్ పూర్తిగా మాస్, యాక్షన్ మోడ్‌లో కనిపించనున్నట్లు ట్రైలర్, టీజర్ ద్వారా ఓ క్లారిటీ వచ్చేసింది. ఆయనకు తల్లి పాత్రలో విజయశాంతి ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌కి న్యాయం చేస్తూ కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై మంచి బజ్‌ను తీసుకువచ్చాయి. ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించడం మరో హైలెట్ గా మారింది. ట్రైలర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాకు సంబంధించి మ్యూజిక్, విజువల్స్, కథనంలో ఎమోషన్ అన్నీ కలిసి పక్కా థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వనున్నట్లు టీం చెబుతోంది.

ఈ చిత్రాన్ని అశోక్ వర్థన్ ముప్పా, సునీల్ బాలుసు కలిసి నిర్మిస్తున్నారు. సాంకేతికంగా కూడా సినిమాను అత్యున్నత స్థాయిలో తెరకెక్కించేందుకు మంచి టీమ్ ను సెట్ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా ఓ మంచి హిట్ అవుతుందన్న నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.