అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. మంచి ఆరంభం!
రిలీజైన అన్ని సెంటర్స్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. దీంతో కళ్యాణ్ రామ్ కెరీర్ లో హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా నిలిచే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 19 April 2025 4:58 AMనందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి కీలకపాత్రలో నటించిన మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో సయూ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించారు. బాలీవుడ్ ప్రముఖ నటులు అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ సహా నిర్మాతగా, సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పా సంయుక్తంగా నిర్మించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. ఏప్రిల్ 18వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైంది. అయితే విడుదలకు ముందే సినిమాపై ఓ రేంజ్ లో హైప్ నెలకొంది. ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తోపాటు ప్రమోషనల్ కంటెంట్.. మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు మూవీ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. రిలీజైన అన్ని సెంటర్స్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. దీంతో కళ్యాణ్ రామ్ కెరీర్ లో హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా నిలిచే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
ఎందుకంటే మార్నింగ్, మ్యాట్నీ షోలకు సినీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆ తర్వాత ఈవెనింగ్, నైట్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ లో అద్భుతమైన ట్రెండ్స్ కనిపించాయి. సెకెండ్ డే ప్రీ బుకింగ్స్ బాగానే జరిగినట్లు తెలుస్తోంది. దీంతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ మంచి కలెక్షన్స్ సాధించడం పక్కా అని క్లియర్ గా కనిపిస్తోంది.
సినిమాలో కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన విషయం తెలిసిందే. ఇంతకుముందే మదర్ సెంటిమెంట్ స్టోరీలతో సినిమాలు వచ్చినా.. డైరెక్టర్ మాత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి టేకింగ్ ను ఎంగేజింగ్ గా చేశారు. దీంతో అందరినీ సినిమా మెప్పిస్తుందనే చెప్పాలి. కళ్యాణ్ రామ్ మాస్ యాక్షన్, విజయశాంతి పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ సూపర్ అని అంతా కొనియాడుతున్నారు.
ముఖ్యంగా సినిమాకు క్లైమాక్స్ మెయిన్ అసెట్ అని చెబుతున్నారు. క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని షాక్ ఫ్యాక్టర్ తో అలరించారు డైరెక్టర్. స్పెషల్ ట్విస్ట్ తో మెప్పించారు. జూనియర్ ఎన్టీఆర్.. మొన్న చెప్పినట్లే క్లైమాక్స్ సూపర్. బాగానే వర్కౌట్ అయింది. చివరి 20 నిమిషాలు అంతా ఫ్లాట్ అయిపోవడం పక్కా అంట. మరి మీరు సినిమా చూశారా? లేదా?