Begin typing your search above and press return to search.

అర్జున్ s/o వైజయంతి.. ఫ్యామిలీ ఆడియెన్స్ మళ్ళీ థియేటర్ కు వచ్చేలా..

కానీ ఈ సినిమాలో మాత్రం విజయశాంతి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతోందని ట్రైలర్‌తోనే క్లారిటీ వచ్చింది.

By:  Tupaki Desk   |   17 April 2025 4:57 PM
అర్జున్ s/o వైజయంతి.. ఫ్యామిలీ ఆడియెన్స్ మళ్ళీ థియేటర్ కు వచ్చేలా..
X

ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీ మేకర్స్ ఎక్కువగా మాస్ మసాలా చిత్రాల మీద దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన క్లాస్ సినిమాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. అయితే ఆ గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు నందమూరి కల్యాణ్‌రామ్ నుంచి వస్తున్న తాజా సినిమా అర్జున్ S/O వైజయంతి. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై బాగా హైప్ క్రియేట్ చేశాయి.

ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు, సెంటిమెంట్ ప్రాధాన్యత ఉండే సినిమాల కోసం ఎదురు చూస్తున్నవాళ్లు ఈ సినిమాకు భారీగా అట్రాక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎక్కువగా ఆకట్టుకునే అంశం ఏమిటంటే.. కల్యాణ్‌రామ్ విజయశాంతి మదర్ సన్ బాండింగ్. ఈ ఇద్దరి ఏమోషన్ ప్రధానంగా ఎట్రాక్ట్ అవుతోంది. ఈ రోజుల్లో మదర్ సన్ భావోద్వేగాన్ని అంత బలంగా చూపించినా, నిజంగా ఆ లెవెల్‌కు వెళ్లే నటీనటుల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావడం అరుదు.

కానీ ఈ సినిమాలో మాత్రం విజయశాంతి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతోందని ట్రైలర్‌తోనే క్లారిటీ వచ్చింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కల్యాణ్ రామ్ క్యారెక్టర్‌ను మరింత బలంగా నిలబెడుతోంది. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ కథను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారనిపిస్తోంది. ఓ సాధారణ యువకుడి జీవితంలో చోటుచేసుకునే ఓ పెద్ద ట్విస్ట్‌ను ఆసక్తికరంగా చూపిస్తూ, ప్రేమ, బాధ, పోరాటం అనే మూడు ఎమోషన్ల తో తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

అలాగే సినిమా మాస్ ఆడియన్స్‌కు నచ్చేలా యాక్షన్, పాటల మిక్స్ కూడా కచ్చితంగా ఉంటుందన్న సంకేతాలు ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది. ప్రమోషనల్ కంటెంట్‌ను గమనిస్తే, సినిమా ప్రధానంగా థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌ను పక్కాగా ప్యాక్ చేసిందనిపిస్తోంది. మొదటి నుండి చిన్న చిన్న అప్‌డేట్స్‌తోనే బజ్ పెంచుతూ వచ్చిన మేకర్స్ చివరికి ట్రైలర్‌తో ఊహించని ఎమోషనల్ పంచ్ ఇచ్చారు.

ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ సెంటర్ లలో అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగాయి. ఎలాంటి కంట్రవర్సీ లేకుండా క్లీన్ సినిమా కావడంతో ఓవరాల్ ఫ్యామిలీ ప్రేక్షకులకు అనువుగా మారింది. ఈ వేసవిలో ఇప్పటి వరకు మంచి కలెక్షన్లు సాధించిన ఫ్యామిలీ డ్రామా ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో అర్జున్ S/O వైజయంతి మెప్పించగలిచితే, అది ఈ సీజన్‌కు ఓ మంచి బ్లాక్‌బస్టర్ ఊపునిస్తుంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఇప్పటికే మెప్పించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో కల్యాణ్ రామ్ క్యారెక్టర్, విజయశాంతి డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. ఇక తొలి రోజే ఓ పాజిటివ్ టాక్ వస్తే, ఈ సినిమా తెలుగు సినిమాకి మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను బలంగా తిరిగి తీసుకురాగలదని చెప్పొచ్చు.