ఈ బజ్ కి టాక్ బాగుంటే.. బ్లాక్ బస్టరే..!
ఇక అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ రావడంతో ఆ జోష్ రెట్టింపు అయ్యింది.
By: Tupaki Desk | 17 April 2025 5:49 PMనందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. మరికొద్ది గంటల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా విషయంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇంపార్టెంట్ రోల్ లో నటించడం కూడా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సినిమా రిలీజ్ ముందు కావాల్సిన బజ్ ఉంటే కాస్త టాక్ బాగంటే చాలు సినిమా మంచి రిజల్ట్ అందుకునే ఛాన్స్ ఉంది.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా విషయంలో డే 1 నుంచి అలాంటి అంచనాలే ఉన్నాయి. ఇక సినిమా బాగా రావడంతో దానికి తగినట్టుగానే ప్రమోషన్స్ చేశారు. సినిమా టీజర్ రిలీజైనప్పటి నుంచే సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించేయగా ట్రైలర్ చూశాక కళ్యాణ్ రాం ఈసారి సరైన గురి పెట్టాడనిపించింది. ముఖ్యంగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో మదర్ అండ్ సన్ ఎమోషన్ ప్రత్యేకంగా నిలిచేలా ఉంది.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఇన్ సైడ్ టాక్ కూడా చాలా బాగుంది. సినిమాలో పైకి కనిపించే కమర్షియల్ అంశాలకు తగినట్టుగానే హృదయాన్ని మెలిపెట్టే ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చెబుతున్నారు. అదే జరిగితే మాత్రం సినిమాకు మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. సినిమా అవుట్ బాగా రావడంతో దానికి తగినట్టుగానే క్రేజీ ప్రమోషన్స్ చేశారు.
ఇక అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ రావడంతో ఆ జోష్ రెట్టింపు అయ్యింది. అన్ని సినిమాలేమో కానీ కళ్యాణ్ రామ్ ఈ సినిమాను ఎంతో ఫోకస్ గా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. తప్పకుండా ఈ అంశాలన్నీ కూడా సినిమాను ప్రేక్షకులకు చేరవేసేలా చేస్తుందని అనిపిస్తుంది.
అంతేకాదు ఈ సినిమాలో మరో స్పెషాలిటీ ఏంటంటే కమర్షియల్ సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన అంశాలు ఉంటే అది కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుంది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు అదే ప్లస్ అవుతుందని అంటున్నారు. సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలన్నీ కూడా ఒకదానికి మించి మరొకటి అనిపించేలా ఉండటంతో కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు నెవర్ బిఫోర్ క్రేజ్ ఏర్పడింది. మరి అది కలెక్షన్స్ గా మారి నందమూరి హీరోకి అదిరిపోయే సక్సెస్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.