సుకుమార్ సక్సెస్ ను చూసి గర్వపడుతోన్న యాక్షన్ కింగ్!
తాజాగా సుకుమార్ గురించి అర్జున్ సర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
By: Tupaki Desk | 29 May 2025 12:41 PM ISTఇండస్ట్రీలో సుకుమార్ ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. అసిస్టెంటెడ్ డైరెక్టర్ గా, రైటర్ గా ప్రయా ణం మొదలుపెట్టి నేడు పాన్ ఇండియాలో నే గొప్ప డైరెక్టర్ గా ఎదిగారు. ఎన్నో హిట్ చిత్రాలు అందించి దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండి యాలో సత్తా చాటారు. ఏకంగా 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా ఓ రికార్డు నెలకొల్పారు.
తాజాగా సుకుమార్ గురించి అర్జున్ సర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆయన దర్శకత్వంలో కుమార్తె ఐశ్వర్య ప్రధాన పాత్రలో 'సీతా పయనం' అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్బంగా అర్జున్ ....సుకుమార్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. 'నేను హీరోగా నటించిన 'హనుమాన్ జంక్షన్' సినిమాకు ఆయన అసోసియేట్ గా డైరెక్టర్ గా పనిచేయడం చూసాను.
కానీ ఇప్పుడాయన ఇండస్ట్రీలో ఓ మహా వృక్షంలా ఎదిగారు. ఇండియా లోనే టాప్ 10 డైరెక్టర్లలో ఒకరుగా స్థానం సంపాదించారు. ఇలా చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. ఆయన చేసిన ఒక్కో సినిమా కూడా మైల్ స్టోన్. వాటిలో నాకు బాగా నచ్చిన చిత్రాలు 'రంగస్థలం', 'పుష్ప'. రెండు చిత్రాలను ఎంతో గొప్పగా ప్రజెంట్ చేసారు. సాధారణ సన్నివేశాన్ని కూడా ఆ సినిమాల్లో ఎంతో బాగా ప్రజెంట్ చేసారు.
నటుడిని ఎలివేట్ చేయడం చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఆయనతో పని చేయడానికి స్టార్ హీరోలంతా సిద్దంగా ఉన్నారు. అలాంటి డైరెక్టర్ మా సినిమాకు అతిధిగా రావడం సంతోషంగా ఉంద`న్నారు. ప్రస్తుతం అర్జున్ నటుడిగా కొనసాగుతూనే డైరెక్టర్ గానూ సినిమాలు చేస్తున్నారు. కుమార్తె ఐశ్వర్యను పెద్ద హీరోయిన్ ని చేయాలనుకున్నారు. ఐశ్వర్య కొన్ని సినిమాలు కూడా చేసింది. వివాహం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ మ్యాకప్ వేసుకుంటుంది.
