Begin typing your search above and press return to search.

విదేశీయుడితో స్టార్ కూతురు ఎంగేజ్మెంట్..!

ఐశ్వర్య మ్యారేజ్ లాస్ట్ ఇయర్ కాగా లేటెస్ట్ గా అంజన ఎంగేజ్మెంట్ కూడా పూర్తైంది. త్వరలోనే అంజన పెళ్లి ఉంటుందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   17 April 2025 7:09 PM IST
విదేశీయుడితో స్టార్ కూతురు ఎంగేజ్మెంట్..!
X

సౌత్ స్టార్ హీరో అర్జున్ సర్జా కూతురు అంజన ఓ విదేశీయుడితో ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుంది. అర్జున్ సర్జా రెండో కుమార్తె అంజన కొన్నాళ్లుగా ప్రియుడితో ప్రేమలో ఉంది. ఐతే లేటెస్ట్ గా ఇటలీలో వీరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షం లోనే ఈ నిశ్చితార్ధం జరిగినట్టు తెలుస్తుంది. ఐతే అర్జున్ సర్జా కూతురు అంజన ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ విదేశీయుడి పూర్తి వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. అంజన తన సోషల్ మీడియాలోనే 13 ఏళ్ల తర్వాత కల నెరవేరింది అంటూ ఒక ఈ ఎంగేజ్మెంట్ పోస్ట్ పెట్టారు.

అంటే అంజన అతనితో 13 ఏళ్లుగా రిలేషన్ షిప్ లో ఉందా అంటూ చెప్పుకుంటున్నారు. అర్జున్ సర్జాకి ఇద్దరు కూతుళ్లు. పెద్ద అమ్మాయి ఐశ్వర్యకు లాస్ట్ ఇయర్ నటుడు ఉమాపతి రామయ్యని ఇచ్చి పెళ్లి చేశాడు. అంతకుముందు ఐశ్వర్యతో అర్జున్ ఒక సినిమా చేయాలని ప్రయత్నించారు. ఐశ్వర్య కూడా హీరోయిన్ గా రాణించాలని అనుకుంది. కానీ ఎందుకో మళ్లీ ఆ ప్రయత్నాలను ఆపేసింది.

ఐశ్వర్య మ్యారేజ్ లాస్ట్ ఇయర్ కాగా లేటెస్ట్ గా అంజన ఎంగేజ్మెంట్ కూడా పూర్తైంది. త్వరలోనే అంజన పెళ్లి ఉంటుందని తెలుస్తుంది. అర్జున్ సర్జా ప్రస్తుతం సౌత్ లో డిఫరెంట్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఎలాంటి పాత్ర అయినా సరే అవలీలగా చేయగల నటుడు అర్జున్. ముఖ్యంగా ఒకప్పుడు హీరోగా ఎన్నో గొప్ప సినిమాలు చేసిన ఆయన ఆ తర్వాత విలన్, స్పెషల్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చారు.

కన్నడ నుంచి వచ్చినా సరే తెలుగులో అర్జున్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఆయన సినిమాలు సౌత్ లో అన్ని భాషల్లో ప్రేక్షకాదరణ పొందాయి. అర్జున్ సర్జా తర్వాత అతని మేనళ్లుడు ధృవ్ సర్జా కూడా కన్నడలో హీరోగా రాణిస్తున్నాడు. ఐతే తన కూతురు ఐశ్వర్యని హీరోయిన్ గా చేయాలని అనుకున్న అర్జున్ సర్జా ఎందుకో ఆ ప్రయత్నాలను ఆపేశారు. ఇక ఐశ్వర్యకు లాస్ట్ ఇయర్ పెళ్లి కాగా అంజన ఎంగేజ్మెంట్ తో అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఐతే అర్జున్ చిన్నల్లుడు డీటైల్స్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. అతను ఎవరు ఏం చేస్తాడు అంజనతో అతని ప్రేమాయణం ఎన్నాళ్లు కొనసాగింది లాంటి విషయాలు తెలుసుకునేందుకు ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు.