Begin typing your search above and press return to search.

'ర‌ధ‌న్' ఇలా యూట‌ర్న్ తీసుకున్నాడేంటో?

ర‌ధ‌న్ ట్యూన్స్ ఇవ్వ‌కుండా టార్చ‌ర్ పెట్ట‌డం వ‌ల్ల మాంటేజెస్ షూట్ చేయ‌డానికి టార్చ‌ర్ అనుభ‌వించాన‌ని చాలా సంద‌ర్భాల్లో ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ ఓపెన్‌గానే వెల్ల‌డించ‌డం తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 April 2025 3:57 PM IST
ర‌ధ‌న్ ఇలా యూట‌ర్న్ తీసుకున్నాడేంటో?
X

టాలీవుడ్ క‌ల్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో `అర్జున్‌రెడ్డి` ఒక‌టి. సందీప్‌రెడ్డి వంగ ద‌ర్శ‌కుడు. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌, బిహేవియ‌ర్‌, సినిమా ర‌న్ టైమ్‌, ఒంట‌ర్వెల్ బ్యాంగ్ వంటి విష‌యాల ప‌రంగా ఈ సినిమా ఓ ట్రెండ్‌ని సెట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు రౌడీ స్టార్ ఇమేజ్‌ని అందించి తిరుగులేని గుర్తింపుని దేశ వ్యాప్తంగా తెచ్చిపెట్టింది. మ్యూజిక్ ప‌రంగానూ ఇప్ప‌టికీ సినీ ప్రియుల్ని హంట్ చేస్తున్న ఈ మూవీకి యువ సంగీత ద‌ర్శ‌కుడు ర‌ధ‌న్ సంగీతం అందించాడు.

ఇందులోని పాట‌ల‌న్నీ మాంటేజెస్ మాత్ర‌మే. దీంతో షూటింగ్ కోసం ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ చాలా ఇబ్బందులు ప‌డ్డాడ‌ట‌. ట్యూన్స్ చేస్తూనే పాట రికార్డ్ చేయించుకుని వాటితో మాంటేజెస్‌ని పూర్తి చేయాలి కాబ‌ట్టి వీటి కోసం ద‌ర్శ‌కుడు తీవ్ర ఇబ్బందులు ఎదుక్కొన్నార‌ట‌. ర‌ధ‌న్ ట్యూన్స్ ఇవ్వ‌కుండా టార్చ‌ర్ పెట్ట‌డం వ‌ల్ల మాంటేజెస్ షూట్ చేయ‌డానికి టార్చ‌ర్ అనుభ‌వించాన‌ని చాలా సంద‌ర్భాల్లో ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ ఓపెన్‌గానే వెల్ల‌డించ‌డం తెలిసిందే.

ట్యూన్ కావాల‌ని ఫోన్ చేస్తే ర‌ధ‌న్ చాలా ఇరిటేట్ చేసేవాడ‌ని, నేను ఇచ్చింది తీసుకో లేదంటే మ‌ధ్య‌లోనే ఆపేస్తాన‌ని బ్లాక్‌మెయిల్ చేశాడ‌ని, చేసేది లేక‌, మ‌ధ్య‌లో మ‌రో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ని పెట్టుకోలేక నాలో నేనే న‌ర‌కం అనుభ‌వించాన‌ని, చెన్నైకి వెళితే అస‌లు టైమే ఇచ్చేవాడు కాద‌ని, ఓ పురుగును చూసిన‌ట్టుగా చూసేవాడ‌ని. మ‌ధ్య‌లో సినిమా వ‌దిలేస్తాన‌ని బెదిరించిన రోజులు కూడా ఉన్నాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఓ ఇంట‌ర్వ్యూలో మాత్రం ర‌ధ‌న్ చేసిన ప‌నికి నాకు బూతులొస్తున్నాయ‌ని బ‌ర‌స్ట్ అయిన సందీప్‌రెడ్డి వంగ జీవితంలో వాడితో ప‌ని చేయ‌న‌ని చెప్పేశాడు.

సందీప్‌రెడ్డితో పాటు `సిద్ధార్ధ్ రాయ్‌` మూవీ డైరెక్ట‌ర్ కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో ర‌ధ‌న్ గురించి ఫైర్ కావ‌డం తెలిసిందే. ర‌ధ‌న్ టార్చ‌ర్ చేశాడ‌ని సందీప్ రెడ్డి వంగ ఓ రేంజ్‌లో ఫైర్ అయితే తాజాగా ర‌ధ‌న్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సందీప్‌పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. `అర్జున్‌రెడ్డి` స‌మ‌యంలో సందీప్ వంగ‌కు తన యాటిట్యూడ్‌తో చుక్క‌లు చూపించిన ర‌ధ‌న్ ఇప్పుడేమో సందీప్ త‌న‌కు తండ్రిలాంటి వాడు అంటూ యూట‌ర్న్ తీసుకోవ‌డం విడ్డూరంగా ఉంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.