Begin typing your search above and press return to search.

అరియనా.. నడుమే వంచాలా ఏంటి?

రీసెంట్ గా అమ్మడు టాప్ క్రాప్ డ్రెస్ లో అలాగే జీన్స్ లో నడుమును వయ్యారంగా వంచేస్తూ స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది.

By:  Tupaki Desk   |   26 Nov 2023 6:27 AM GMT
అరియనా.. నడుమే వంచాలా ఏంటి?
X

బిగ్ బాస్ ద్వారా క్రేజ్ కొట్టేసిన బ్యూటీ అరియానా గ్లోరీ సోషల్ మీడియా ప్రపంచంలో ఇప్పుడు మరింత హైలెట్ అవుతోంది. ఒకానొక సమయంలో చిన్న యూట్యూబ్ యాంకర్ గా గుర్తింపు చాలా తాపత్రయపడిన ఈ అమ్మడు ఇప్పుడు ఫుల్ ఫేమస్ అయిపోతోంది. బ్యూటీఫుల్ యాంకర్ గా దూసుకుపోతున్న ఈ అమ్మడు.. బుల్లితెరపై పలు షోలల్లో మెరుస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక రీసెంట్ గా ఓ అదిరిపోయే ఫొటోషూట్ తో స్టన్ అయ్యేలా చేసింది.


మొదట్లో కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో తో కలిసి జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేసి.. ఫుల్ పబ్లిసిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ అనంతరం వచ్చిన క్రేజ్ ను బిగ్ బాస్ తో మరో లెవెల్ కు తీసుకు వెళ్లింది. అలాగే సిల్వర్ స్క్రీన్ పై రాణించేందుకు ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు చేసింది. చిన్న సినిమాలతో వెండితెరకు కూడా ఎంట్రీ కూడా ఇచ్చింది.


ఆ మధ్య రాజ్ తరుణ్ అనుభవించు రాజా చిత్రంలో ఒక ప్రత్యేకమైన రోల్ లో కనిపించి ఆకట్టుకుంది. ఇదే ఆమెకు మొదటి సినిమా కావడం విశేషం. అనంతరం బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ చిత్రంలోనూ మెరిసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామరస్ ఫోటో షూట్ లతో రచ్చ రచ్చ చేస్తుంది. ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుతుంది.

రీసెంట్ గా అమ్మడు టాప్ క్రాప్ డ్రెస్ లో అలాగే జీన్స్ లో నడుమును వయ్యారంగా వంచేస్తూ స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది. దీంతో ఆ ఫొటోను చూసిన వారు విజయ్ దేవరకొండ స్టైల్ లో అందంగా కనిపించాలి అంటే నడుమే వంచాలా ఏంటి.. అన్నట్లు డైలాగ్ కొట్టేస్తున్నారు. అమ్మడు నడుము వంచక పోయినా అందంగా ఉంటుందని, చూపులతోనే ఎట్రాక్ట్ చేస్తోందని అంటున్నారు.

అలా ఎప్పటికప్పుడు ఈ గ్లామర్ గర్ల్ షేర్ చేస్తున్న ఫొటోస్ కు యూత్ ఫిదా అవుతూ ఉన్నారు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అదిరిపోయే అవుట్ ఫిట్ లో తన అందాలు మొత్తం హైలెట్ చేస్తూ.. తన ఫ్యాషన్ సెన్స్ తో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ ఈ అందాల ప్రదర్శనతో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో..