Begin typing your search above and press return to search.

మెల్ బోర్న్ వీధుల్లో అరియానా అదిరిపోయే అందాలు..!

ఇక, తన నడుము అంతా కనిపించేలా ఫోటోలు దిగడం విశేషం. ఆ డ్రెస్ లో చాలా కాన్ఫిడెంట్ గా ఆమె ఫోటోలు దిగగా, అవి నెట్టింట వైరల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   1 Sep 2023 12:34 PM GMT
మెల్ బోర్న్ వీధుల్లో అరియానా అదిరిపోయే అందాలు..!
X

ఒక నాలుగైదేళ్ల క్రితం అయితే అరియానా అంటే ఎవరూ గుర్తుపట్టేవారు కాదేమో, కానీ, ప్రస్తుతం మాత్రం అరియానాకు పరిచయం అవసరంలేదు. ఓ చిన్న టీవీలో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు సెలబ్రెటీ హోదా దక్కించుకుంది. ప్రముఖ కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడంతో ఆమె కెరీర్ రాత్రికి రాత్రే మారిపోయింది. ఆ ఇంటర్వ్యూతో గుర్తింపు రాగా, బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత మరింత క్రేజ్ సంపాదించుకుంది.


వరసగా బిగ్ బాస్ టీమ్ తో మూడు, నాలుగేళ్లు పనిచేసింది. ఆ తర్వాత పలు టీవీ షోలు చేస్తోంది. సినిమాల్లోనూ చిన్న చిన్న రోల్స్ వస్తున్నాయి. కాగా, అప్పటి నుంచి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారిపోయింది. గ్యాప్ లేకుండా తన ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది. ఆమె ఫోటోలకు నెటిజన్లు ఎక్కువగా ఇంప్రెస్ అవుతూ ఉంటారు. లైకుల వర్షం, కామెంట్ల వరద కురుస్తూఉంటుంది.

తాజాగా, కూడా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అయితే, ఆ ఫోటోలు ఆమె ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో తీసుకున్నట్లు తెలుస్తోంది. మెల్ బోర్న్ వీధుల్లో ఫోటోలు దిగి, వాటిని తన అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోల్లో బ్లూ డెనిమ్ జీన్స్ ధరించింది. దానికి పింక్ కలర్ క్రాప్ టాప్ మ్యాచ్ చేసింది. ఇక, తలకు పర్పుల్ కలర్ క్యాప్ ధరించింది. కాళ్లకు ట్రాన్సపరెంట్ హై హీల్స్ మ్యాచ్ చేసింది.

ఇక, తన నడుము అంతా కనిపించేలా ఫోటోలు దిగడం విశేషం. ఆ డ్రెస్ లో చాలా కాన్ఫిడెంట్ గా ఆమె ఫోటోలు దిగగా, అవి నెట్టింట వైరల్ గా మారాయి. కొద్ది రోజుల క్రితమే తన స్నేహితులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన ఆమె, మళ్లీ వెళ్లడం విశేషం. అక్కడ ఏదైనా షోలు చేయడానికి లేదంటే, సరదాగా ట్రావెలింగ్ మీద ఇష్టంతో వెళ్లి ఉండొచ్చు.

ఇక, గతంలో అరియానా చాలా సన్నగా ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం బొద్దుగా మారింది. అయితే, చాలా మంది ఆమెను అలా బొద్దుగా మారిన తర్వాత చూడలేకపోతున్నారు. మళ్లీ మాకు పాత అరియానా కావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, త్వరలోనే ఆమె మళ్లీ వెబ్ సిరీస్ లు, ప్రోగ్రామ్ లతో తన అభిమానులను అలరించనుంది.