డైరెక్టర్ గా స్టార్ సింగర్.. జక్కన్న మూవీ జోనర్ లో డెబ్యూ..
సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే హీరోలు డైరెక్టర్లు గా మారారు. డైరెక్టర్లు కూడా హీరోలుగా మారారు.
By: Tupaki Desk | 17 July 2025 4:00 AM ISTసినీ ఇండస్ట్రీలో ఇప్పటికే హీరోలు డైరెక్టర్లు గా మారారు. డైరెక్టర్లు కూడా హీరోలుగా మారారు. అయితే ఇప్పుడు రేర్ గా ఒక సింగర్.. డైరెక్టర్ గా మారుతున్నారు. అవును మీరు చదువుతున్నది నిజమే. స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ ఇప్పుడు దర్శకుడిగా డెబ్యూ చిత్రంతో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఆ పనుల్లో ఫుల్ బిజీగా ఆయన ఉన్నారు.
అర్జిత్ సింగ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాకు మహావీర్ జైన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే చాలా కాలంగా తన భార్య కోయెల్ సింగ్ తో కలిసి స్క్రిప్ట్ పై పని చేస్తున్నారు అర్జిత్. ఇప్పుడు దాన్ని సినిమా రూపంలో తీసుకురానున్నారు. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. భారీ బడ్జెట్ తో మూవీ రూపొందనుంది.
అలోక్ద్యుతి ఫిల్మ్స్ బ్యానర్ పై మహావీర్ జైన్ నిర్మిస్తున్న ఆ సినిమాకు గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్స్ సహ నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది. మేకర్స్ మరికొద్ది రోజుల్లో క్యాస్టింగ్ ను ఫిక్స్ చేయనున్నారని టాక్. స్టార్ నటీనటులను రంగంలో దించనున్నారట. 2025 చివర్లో సినిమా స్టార్ట్ అవుతుందని.. 2026లో రిలీజ్ కానుందని సమాచారం.
ఫారెస్ట్ అడ్వెంచర్ జోనర్ లో అర్జిత్ సింగ్.. డైరెక్టర్ గా తన డెబ్యూ మూవీని తీస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం విన్న వెంటనే.. మనకు SSMB 29 సినిమా గుర్తొస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది.
ఇప్పుడు అర్జిత్ సింగ్ కూడా ఆ జోనర్ లోనే సినిమా తీస్తున్నారు. మరికొద్ది రోజుల్లో వివిధ అప్డేట్స్ ను ఆయన ఇవ్వనున్నారని తెలుస్తోంది. అందుకుగాను రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. అయితే అర్జిత్ సింగ్.. తెలుగు సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. టాలీవుడ్ లో ఎన్నో మంచి మంచి హిట్ సాంగ్స్ ను ఆలపించారు.
హిందీ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, తమిళ, కన్నడ సహా ఇతర భాషల్లోనూ అనేక ఐకానిక్ సాంగ్స్ ను పాడారు. తన గాత్రంతో ఎందరో హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పటి వరకు ఆరు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ గాయకుడు (మేల్) అవార్డులను గెలుచుకున్నారు. రెండు జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. మరి డైరెక్టర్ గా డెబ్యూ మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.
