Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ OTTలో వాళ్లు ఫిక్స్ అయ్యారా..?

అయితే ఓటీటీ బిగ్ బాస్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.

By:  Tupaki Desk   |   31 Dec 2023 10:20 AM GMT
బిగ్ బాస్ OTTలో వాళ్లు ఫిక్స్ అయ్యారా..?
X

బిగ్ బాస్ సీజన్ 7 ఓ రేంజ్ లో సక్సెస్ అవ్వడం తో ఏమాత్రం గ్యాప్ లేకుండా బిగ్ బాస్ నాన్ స్టాప్ అదే ఓటీటీ బిగ్ బాస్ ని స్టార్ట్ చేయాలని బిగ్ బాస్ టీం సిద్ధం అవుతుంది. బిగ్ బాస్ రెగ్యులర్ సీజన్లతో పాటుగా బిగ్ బాస్ ఓటీటీ అని రెండేళ్ల క్రితం ప్రయత్నించారు. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ 24/7 షో రన్ చేశారు. హోస్ట్ గా నాగార్జుననే ఓటీటీ బిగ్ బాస్ ని చేశారు. అయితే ఓటీటీ బిగ్ బాస్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.

కేవలం డిస్నీ+హాట్ స్టార్ లోనే అది టెలికాస్ట్ అవ్వడం వల్ల ఆ టైం లో ఎక్కువమంది ఓటీటీ బిగ్ బాస్ చూడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు బిగ్ బాస్ ఆడియన్స్ అంతా కూడా డిస్నీ హాట్ స్టార్ సబ్ స్క్రైబర్స్ గా ఉన్నారు. కాబట్టి బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ మీద ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. అయితే ఓటీటీ సీజన్ లో ఆల్రెడీ బిగ్ బాస్ రెగ్యులర్ షోలో పాపులర్ అయిన వారిని కొందరిని తీసుకుంటారు. ఈ క్రమంలో ఈసారి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 లో కూడా బిగ్ బాస్ సీజన్ 7 కి సంబంధించిన వారిని తీసుకుంటున్నారని తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న యావర్, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన బోలే శావలి, నయని పావని ఈ ముగ్గురు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కి వెళ్తారని టాక్. యావర్ ఆల్రెడీ సీజన్ 7 లో టాప్ 4 దాకా వచ్చాడు. అతనికి హౌస్ లో ఎలా ఆడాలో తెలుసు. మరోపక్క బోలే శావలి కూడా బయటకు వచ్చాక ఎలా ఆడాలో తెలుసుకున్నాడు. నయని పావని సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ గా వెళ్లి వారం లోనే ఎలిమినేట్ అయ్యింది.

ఈ ముగ్గురికి బిగ్ బాస్ ఓటీటీ 2 లో ఛాన్స్ ఇస్తున్నారని తెలుస్తుంది. వీరితో పాటుగా మరికొంతమంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 లో ఉంటారు. 70 రోజులు జరుగనున్న ఈ ఓటీటీ బిగ్ బాస్ సెకండ్ సీజన్ కి మళ్లీ నాగార్జుననే హోస్ట్ గా చేస్తారని తెలుస్తుంది. 2024 మార్చి నుంచి బిగ్ బాస్ OTT 2 మొదలవుతుందని తెలుస్తుంది.