Begin typing your search above and press return to search.

అర్బాజ్ ఖాన్ కొత్త‌ గర్ల్ ఫ్రెండ్ నేప‌థ్యం?

ఇంత‌లోనే స‌డెన్ ట్విస్ట్. ఇప్పుడు ఆర్భాజ్ ఖాన్ ప్ర‌ముఖ బాలీవుడ్ మేక‌ప్ ఉమెన్ ని రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు

By:  Tupaki Desk   |   23 Dec 2023 12:30 AM GMT
అర్బాజ్ ఖాన్ కొత్త‌ గర్ల్ ఫ్రెండ్ నేప‌థ్యం?
X

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్, న‌టుడు ఆర్భాజ్ ఖాన్ మ‌లైకా అరోరా నుంచి విడిపోయాక విదేశీ మోడ‌ల్ జార్జియా ఆండ్రియానీతో ప్రేమాయ‌ణం సాగించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఈ జంట ఏడాది కింద‌టే విడిపోయామ‌ని ఇటీవ‌ల ఓ మీడియా చాట్ లో ప్ర‌క‌టించారు. అయితే విడిపోయినా కానీ తాము మంచి స్నేహితులుగా ఉన్నామ‌ని జార్జియా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.


ఇంత‌లోనే స‌డెన్ ట్విస్ట్. ఇప్పుడు ఆర్భాజ్ ఖాన్ ప్ర‌ముఖ బాలీవుడ్ మేక‌ప్ ఉమెన్ ని రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఆల్ ఆఫ్ స‌డెన్.. డిసెంబ‌ర్ 24న ఈ జంట పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. కుటుంబీకులు కొద్ది మంది స‌న్నిహితుల స‌మక్షంలో ఈ పెళ్లి జ‌ర‌గ‌నుంది. ఆ మేర‌కు ప్ర‌ముఖ జాతీయ మీడియా బ్రేకింగ్ న్యూస్ వేయ‌డంతో అది కాస్తా వాడి వేడి చ‌ర్చ‌కు తెర తీసింది. ఇంత‌కీ ఆర్భాజ్ పెళ్లాడేది ఎవ‌రిని? అంటే... ర‌వీనాటాండ‌న్, ఆమె కుమార్తె రాషా త‌డానీల‌కు వ్య‌క్తిగ‌త మేక‌ప్ ఉమెన్ షురాఖాన్. ఈ భామ బాలీవుడ్ లో ప‌లువురు టాప్ స్టార్ల‌కు మేక‌ప్ ఆర్టిస్టుగా కొన‌సాగుతున్నారు.

అయితే ఆర్భాజ్ ఖాన్ స‌ద‌రు మేక‌ప్ ఉమెన్ షురాను ఆన్ లొకేష‌న్ క‌లుసుకున్నాడు. ఈ ఇద్ద‌రూ ఇటీవ‌ల 'పాట్నా శుక్లా' అనే సినిమాకి క‌లిసి ప‌ని చేస్తున్నారు. ఈ మూవీ సెట్లో క‌లుసుకున్నారు. అనంత‌రం ఇద్ద‌రి మ‌ధ్యా ప్రేమ మొద‌లైంది. ఇంత‌లోనే ఇప్పుడు పెళ్లికి బాజాలు మోగ‌నున్నాయ‌న్న క‌బురందింది. మ‌లైకా అరోరాఖాన్ తో 18ఏళ్ల సంసార జీవితం అనంత‌రం విడాకులిచ్చిన ఆర్భాజ్ ఇటీవ‌లి ఏడాది కింద‌టివ‌ర‌కూ గాళ్ ఫ్రెండ్ జార్జియాతో స‌హ‌జీవ‌నం సాగించాడు. కానీ ఇది కూడా బ్రేక‌ప్ అయింది. ఇప్పుడు అత‌డు షురాఖాన్ తో రెండో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నాడు.