57 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న టాలీవుడ్ విలన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంటరైన అర్బాజ్ ఖాన్ ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
By: Tupaki Desk | 5 Jun 2025 6:48 PM ISTబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంటరైన అర్బాజ్ ఖాన్ ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అర్బాజ్ ఖాన్ తన అన్నలాగా హీరోగా నిలదొక్కుకోకుండా పలు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేసి వాటితోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా పలు షో లకు హోస్ట్ గా కూడా అర్బాజ్ ఖాన్ వ్యవహరించాడు.
అర్బాజ్ ఖాన్ కు ఇప్పుడు 57 ఏళ్లు. ఈ వయసులో అతను తండ్రి కాబోతున్నాడని బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అర్బాజ్ ఖాన్ 2023లో మేకప్ ఆర్టిస్ట్ అయిన షురా ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకోగా, ఇప్పుడీ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అర్బాజ్ ఖాన్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా రాలేదు.
కానీ సోషల్ మీడియాలో మాత్రం అర్బాజ్ ఖాన్ భార్య షురా ఖాన్ బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండటంతో అర్బాజ్ ఖాన్ 57 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. అయితే అర్బాజ్ ఖాన్ మొదట స్టార్ హీరోయిన్ మలైకా అరోరా ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 1998లో మలైకాను పెళ్లి చేసుకున్న అర్బాజ్ 2017లో ఆమెకు విడాకులిచ్చాడు. విడాకుల తర్వాత కొన్నాళ్ల పాటూ సింగిల్ గానే ఉన్న అర్బాజ్ ఖాన్ ఆ తర్వాత షురా ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
అర్బాజ్ ఖాన్ సినీ కెరీర్ విషయానికొస్తే అతను కేవలం హిందీ సినిమాల్లోనే కాకుండా సౌత్ లో కూడా కొన్ని సినిమాలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవా సినిమాలో విలన్ గా నటించాడు. రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో పాటూ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా వచ్చిన శివం భజే సినిమాలో కూడా విలన్ గా నటించాడు.
