Begin typing your search above and press return to search.

తమన్నా- రాశి.. 50 కోట్ల బూస్ట్!

అరణ్మనై సిరీస్ లో వచ్చిన గత మూడు సినిమాలలో రెండు మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

By:  Tupaki Desk   |   15 May 2024 4:04 AM GMT
తమన్నా- రాశి.. 50 కోట్ల బూస్ట్!
X

సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన హర్రర్ జోనర్ సిరీస్ అరణ్మనై. ఇందులో నాలుగో చిత్రం 10 రోజుల క్రితం రిలీజ్ అయ్యింది. తమిళంలో అరణ్మనై 4గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాగా తెలుగులో బాక్ అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. అరణ్మనై సిరీస్ లో వచ్చిన గత మూడు సినిమాలలో రెండు మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. మూడో సినిమా యావరేజ్ గా నిలిచింది.

కొత్త కథలతో కాకుండా అదే కథని సుందర్ సి అరణ్మనై 4లో కూడా కొనసాగించారు. ఈ సిరీస్ కి ఉన్న ఆదరణ నేపథ్యంలో కోలీవుడ్ లో మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. తెలుగులో కూడా వీకెండ్ మూడు రోజులు మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే తెలుగు ప్రేక్షకులకి ఈ మూవీ పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ తమిళంలో మాత్రం టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను రాబట్టింది.

తమన్నా, రాశిఖన్నా ఈ చిత్రంలో లీడ్ రోల్స్ లో నటించారు. తమన్నా ఘోస్ట్ గా మూవీలో చేయడం విశేషం. అలాగే ఈ ఇద్దరు భామల గ్లామర్ షో కూడా సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. దీంతో తమిళ్ ఆడియన్స్ సినిమా చూడటానికి థియేటర్స్ కి వెళ్ళారు. పోటీగా పెద్దగా ఏ సినిమాలు లేకపోవడం బాగా కలిసి వచ్చింది. ఈ మూవీ పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా 50 కోట్ల గ్రాస్ ని దాటేసింది.

తెలుగులో మొదటి వారంలో 2.8 కోట్ల గ్రాస్ ను బాక్ మూవీ కలెక్ట్ చేసింది. మిగిలిన మూడు రోజుల్లో 75 లక్షల గ్రాస్ వసూళ్లు అందుకుంది. దీంతో ఇప్పటి వరకు 3.55 కోట్ల గ్రాస్ బాక్ సినిమా సాధించింది. అందులో షేర్ 1.8 కోట్ల దాకా ఉంది. అయితే 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ లెక్కన ఇంకా 70 లక్షల షేర్ రాబట్టాల్సి ఉంది.

వరల్డ్ వైడ్ గా 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన మూవీ 10 రోజుల్లోనే 26.25 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అంటే 9.25 కోట్ల ప్రాఫిట్ అరణ్మనై సినిమా ఇప్పటి వరకు సాధించింది. దీంతో బ్లాక్ బస్టర్ హిట్ కేటగిరీలో ఈ మూవీ చేరిపోయింది. వరుస ఫ్లాప్స్ తో ఉన్న తమన్నా రాశి ఖన్నా ఇద్దరికి కూడా ఈ సినిమా కొంత బూస్ట్ ఇచ్చింది. మరి ఈ లెక్కతో ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు అందుకుంటారో చూడాలి.

అరణ్మనై వరల్డ్ వైడ్ గా 12 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి.

తమిళనాడులో 41.60 కోట్లు

తెలుగు రాష్ట్రాలలో 3.55 కోట్లు

కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం 3.95 కోట్లు

ఓవర్సీస్ లో 5.10 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్ 54.20 కోట్లు